రాష్ట్రస్థాయి జైళ్ల శాఖ కబడ్డీ పోటీలకు సబ్‌ జైలు సూపరింటెండెంట్‌ ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి జైళ్ల శాఖ కబడ్డీ పోటీలకు సబ్‌ జైలు సూపరింటెండెంట్‌ ఎంపిక

Aug 7 2025 8:08 AM | Updated on Aug 7 2025 11:46 AM

రాష్ట

రాష్ట్రస్థాయి జైళ్ల శాఖ కబడ్డీ పోటీలకు సబ్‌ జైలు సూపరిం

వినుకొండ: వినుకొండ సబ్‌జైల్‌ సూపరింటెండెంట్‌ అమరా కృష్ణారావు జైళ్ల శాఖ రాష్ట్రస్థాయి కబడ్డీ జట్టుకు ఎంపికయ్యారు. ఈనెల 6వ తేదీన నెల్లూరులో జరిగిన శిక్షణా శిబిరంలో ప్రతిభ కనపరచిన ఆయన సెప్టెంబరు 9,10 తేదీల్లో హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఆంధ్రప్రదేశ్‌ జట్టు తరఫున ఆడనున్నారు. ఈసందర్భంగా సహచర ఉద్యోగులు సిబ్బంది కృష్ణారావును అభినందించారు.

9న మున్సిపల్‌ కార్యాలయాల ఎదుట టూల్‌డౌన్‌

మంగళగిరి టౌన్‌: మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవో నంబరు 36పై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌, వైఎస్సార్‌ట్రేడ్‌ యూనియన్‌ నేతలు డిమాండ్‌ చేశారు. మంగళగిరి నగర పరిధిలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన అన్ని మున్సిపల్‌ కార్యాయాల వద్ద టూల్‌డౌన్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. జీవో నెంబర్‌ 36పై స్పష్టత ఇవ్వకపోవడం, అమలు చేయకపోవడంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండికోట దుర్గారావు, వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ నియోజకవర్గ అధ్యక్షుడు రత్నాకరం శ్రీనివాసరాజు, పట్టణ వైఎస్సార్‌టీయూసీ అధ్యక్షుడు నక్క నాగరాజు, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

‘విద్యా శక్తి’పై నిర్బంధం తగదు

గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించిన విద్యాశక్తి కార్యక్రమాన్ని నిర్బంధం చేయడం తగదని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా చైర్మన్‌ కె.నరసింహారావు పేర్కొన్నారు. బుధవారం డీఈవో కార్యాలయంలో జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుకను కలిసిన నాయకులు తమ ఇబ్బందులను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ పలుచోట్ల విద్యాశక్తి కార్యక్రమాన్ని నిర్బంధంగా నిర్వహిస్తున్నారని అన్నారు. అలసిపోయిన విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. వారి మానసిక, శారీరక పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఇలా చేయడం తగదన్నారు. హెచ్‌ఎంలకు తగు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. డీఈవో మాట్లాడుతూ కార్యక్రమం నిర్బంధ కాదని, ఐచ్ఛికమేనని తెలిపారు. ఫ్యాప్టో జిల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్స్‌ యు.రాజశేఖర్‌రావు, డీకే సుబ్బారెడ్డి, ఎండీ ఖలీద్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు తిరుమలేష్‌, ఎం.కళాధర్‌, డి.పెదబాబు, బాలాజీ, వై.శ్యాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి జైళ్ల శాఖ కబడ్డీ పోటీలకు సబ్‌ జైలు సూపరిం1
1/2

రాష్ట్రస్థాయి జైళ్ల శాఖ కబడ్డీ పోటీలకు సబ్‌ జైలు సూపరిం

రాష్ట్రస్థాయి జైళ్ల శాఖ కబడ్డీ పోటీలకు సబ్‌ జైలు సూపరిం2
2/2

రాష్ట్రస్థాయి జైళ్ల శాఖ కబడ్డీ పోటీలకు సబ్‌ జైలు సూపరిం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement