
నాణ్యమైన ఎరువులు విక్రయించాలి
బెల్లంకొండ: దుకాణదారులు రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను విక్రయించాలని క్రోసూరు డివిజన్ ఏడీఏ మస్తానమ్మ సూచించారు. మంగళవారం మండలంలోని పలు ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల దుకాణాలను తహసీల్దార్ ప్రవీణ్, మండల వ్యవసాయ అధికారి అరుణకుమారితో కలిసి తనిఖీ చేశారు. నాణ్యతలేని విత్తనాలను, ఎరువులను విక్రయిస్తే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిషేధిత పురుగుమందుల విక్రయం నేరమన్నారు. రైతులకు నాణ్యత కలిగిన విత్తనాలనే విక్రయించాలని, అదేవిధంగా కొనుగోలు చేసిన ప్రతిదానికి రైతులకు బిల్లులు ఇవ్వాలని సూచించారు.
లయన్స్ క్లబ్ జిల్లా రీజినల్ సెక్రటరీగా రామకోటయ్య
సత్తెనపల్లి: లయన్స్ క్లబ్ జిల్లా రీజినల్ సెక్రటరీగా లయన్స్ క్లబ్ ఆఫ్ సత్తెనపల్లి టౌన్ మాజీ అధ్యక్షుడు, మాజీ జోన్ చైర్మన్ పొత్తూరి రామకోటయ్య నియమితులయ్యారు. 316 హెచ్ జిల్లా గవర్నర్ సీహెచ్ హరిప్రసాద్ నుంచి మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. పొత్తూరి రామకోటయ్య 2025–26 పల్నాడు జిల్లా రీజినల్ సెక్రటరీగా కొనసాగుతారు. ఈ సందర్భంగా లయన్స్ రీజినల్ చైర్మన్ తోట చిన్న సాంబయ్య. లయన్స క్లబ్ సభ్యులు, మిత్రులు, పలువురు రామకోటయ్యకు అభినందనలు తెలిపారు.
ప్రకృతి సాగు భేష్
పెదకూరపాడు: ప్రకృతి వ్యవసాయంలో రాష్ట్ర అభ్యుదయ రైతు అవార్డు గ్రహీత దర్శి శేషారావు ఆదర్శనీయమని సత్తెనపల్లి వ్యవసాయ శాఖ ఏడీఏ బోడపాటి రవికుమార్ అన్నారు. మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా శేషారావు పొలాన్ని ఏడీఏ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ 30 రకాలతో తీగజాతి, చెట్టు జాతి, కాయ జాతి, నూనె జాతి, పప్పు జాతి రకాలు వేసిన పొలాన్ని ఇప్పుడే మొట్టమొదటిసారి చూస్తున్నామన్నారు. వాణిజ్య పంటలు వేసే ప్రతి రైతు ముఖ్యంగా మిరప సాగు చేసే రైతులు పీఎండీఎస్ వేసుకోవాలన్నారు. పీఎండీఎస్ వేయటం ద్వారా ప్రధాన పంటకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. పంట ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చన్నారు. ఆయన వెంట పెదకూరపాడు మండల వ్యవసాయ శాఖ అధికారి డి.కృష్ణయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

నాణ్యమైన ఎరువులు విక్రయించాలి

నాణ్యమైన ఎరువులు విక్రయించాలి