
ప్రకృతి వ్యవసాయంలో భాగస్వామ్యం కావాలి
జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి అమలకుమారి
ఈపూరు(శావల్యాపురం): ప్రకృతి వ్యవసాయంలో రైతుసేవా కేంద్రం వీఏఏలు భాగస్వామ్యం కావాలని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజరు కె.అమలకుమారి అన్నారు. మంగళవారం ఈపూరులోని రైతుసేవా కేంద్రంలో బొల్లాపల్లి, శావల్యాపురం, ఈపూరు మండలాలకు చెందిన వీఏఏలకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కె.అమలకుమారి మాట్లాడుతూ రసాయనిక ఎరువులు మోతాదు పెరగటం వలన భూమిలో పోషకాల శాతం తగ్గిపోయి మానవాళి అంతు చిక్కని వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమి ఆరోగ్యంగా ఉండి రైతులకు పెట్టుబడులు తగ్గి ఆదాయం పెరుగుతుందన్నారు. నీటి నిల్వ స్థాయి సామర్ధ్యం పెంపుదలతో పాటు భూసారం పెరుగుతుందన్నారు. జిల్లా డీడీఏ కార్యాలయ అధికారి హనుమంతరావు, వినుకొండ ఏడీఏ రవికుమార్, ఏఓలు రామినేని రామారావు, ఆంజనేయనాయక్, ప్రకృతి వ్యవసాయ శిక్షకులు సైదయ్య, డీటీ శివలక్ష్మి, తిరుపతిరావు, యూనిట్ ఇన్‌చార్జ్ ఆంజనేయులు, లక్షణ్‌నాయక్, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.