యోగాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి
నరసరావుపేట: యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా ప్రజలందరి భాగస్వామ్యం పెద్దఎత్తున కావాలని జిల్లా కలెక్టరు పి.అరుణ్‌బాబు కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామ, మండల, జిల్లాస్థాయిలో యోగాంధ్ర పోటీలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల వారీగా ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మున్సిపాలిటీల్లో యోగా స్ట్రీట్ ఏర్పాటుచేసి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా నిర్వహించాలని తెలిపారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగాలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ క్యూఆర్ కోడ్, వెబ్‌సైట్ ద్వారా నమోదు కావాలని ఆయన కోరారు. సమీపాన ఉన్న గ్రామ, వార్డుల ప్రాంతాలలో ఏర్పాటు చేసిన యోగా కేంద్రాల వద్ద కూడా పాల్గొనవచ్చునని తెలిపారు. ఇంటర్నేషనల్ యోగాలో పాల్గొనేందుకు లింకు ద్వారా నమోదు కావాలని ఆయన సూచించారు. కలెక్టర్ బంగ్లా రోడ్డులో సోమవారం ఉదయం 6.30గంటలకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు.
కలెక్టరు అరుణ్ బాబు క్యూఆర్ కోడ్, వెబ్‌సైట్ లింక్ ద్వారా నమోదు


