నరసరావుపేట: జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న రావిపాడు గ్రామ రైతులకు తగిన నష్టపరిహారం ఇస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే పేర్కొన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో భూములు కోల్పోతున్న నరసరావుపేట మండలం రావిపాడు గ్రామస్తులకు నష్టపరిహార చెల్లింపులపై నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి జేసీ హాజరై రైతులకు ఈ మేర హామీ ఇచ్చారు. ఆర్డీఓ కె.మధులత, జాతీయ రహదారి విస్తరణ అధికారులు, తహసీల్దార్ వేణుగోపాలరావు, మండల సర్వేయర్ మాట్లాడారు. రైతులు పాల్గొన్నారు.