బేస్‌బాల్‌లో ఆంధ్రజట్టుకు ఎంపికై న విద్యార్థులు
క్రోసూరు: పంజాబ్ రాష్ట్రం సంగ్రూరులో మార్చి 27 నుంచి 31వ తేదీ వరకు జరిగే సబ్ జూనియర్ బేస్‌బాల్ నేషనల్ టోర్నమెంట్‌కు క్రోసూరు సెయింట్ ఆన్స్ పాఠశాల విద్యార్థులు నలుగురు ఎంపికై నట్లు హెచ్‌ఎం సిస్టర్ మేరీ రజిత సోమవారం తెలిపారు. ఎంపిక వివరాలు తెలుపుతూ ఆదివారం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం, కసుమూరులో బేస్‌బాల్ రాష్ట్ర జట్టును ఎంపిక చేశాన్నారు. అందులో క్రోసూరు సెయింట్ ఆన్స్ పాఠశాల విద్యార్థులు నలుగురు ఎంపికై నట్లు తెలిపారు. ఎనిమిదవ తరగతికి చెందిన వి.గ్రీష్మ బిందు, ఎం.గాయత్రి, అదేవిధంగా ఏడవ తరగతికి చెందిన కె.జాషువా డేనియల్, ఎస్‌కే అబుబకర్‌లను ఆంధ్ర జట్టుకి ఎంపిక చేసినట్లు చెప్పారు. తమ పాఠశాల విద్యార్థులు నేషనల్ టోర్నమెంట్‌కు ఎంపికవడంపై ఎంతో సంతోషంగా ఉందని, ఆంధ్రజట్టు తరఫున పోటీల్లో గెలిచి తమ పాఠశాలకు మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.
రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని మృతదేహం
సత్తెనపల్లి: గుర్తు తెలియని మృతదేహం పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని నిర్మల నగర్ సమీపంలో గల రైల్వే పట్టాలపై సోమవారం కనిపించింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నిర్మలా నగర్ రైల్వేగేట్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం రైల్వే పట్టాలపై పడి ఉంది. మృతదేహం పూర్తిగా చిధ్రమై ఉండడంతో గుర్తుపట్టడం అసాధ్యంగా మారింది.