
వైఎస్ జగన్ ప్లకార్డులతో వైద్య శిబిరానికి వచ్చిన గ్రామస్తులతో అంబటి మురళీకృష్ణ
చేబ్రోలు: కంటి సమస్యలతో బాధపడేవారికి ఊరట కలిగించి, వారిలో చీకట్లను పారదోలి, తిరిగి వెలుగును ఇచ్చే కార్యక్రమంగా బజరంగ్ నేత్ర జ్యోతి గ్రామీణ ప్రాంతాల్లో విస్త్రృతంగా పని చేస్తోందని బజరంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అంబటి మురళీకృష్ణ పేర్కొన్నారు. బజరంగ్ జగన్నామ సంక్షేమ సంవత్సరంలో భాగంగా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం, పాతరెడ్డిపాలెం గ్రామాల్లో ఆదివారం బజరంగ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన నేత్ర జ్యోతి కార్యక్రమం ద్వారా 903 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. శిబిరాన్ని స్థానిక పెద్దలతో కలసి అంబటి మురళీకృష్ణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ కంటిచూపు చాలా ముఖ్యమైందని తెలిపారు. అంధత్వ సమస్యల పరిష్కారానికి బజరంగ్ కృషి చేస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాల స్ఫూర్తితో బజరంగ్ సేవా కార్యక్రమాలు కొనసాగతున్నాయని చెప్పారు. గత 11 నెలలుగా 12 వేల మందికి పైగా ప్రజలకు నేత్ర జ్యోతి ద్వారా వైద్య పరీక్షలు చేయించి, అవసరమైన వారికి కళ్లజోళ్లు పంపిణీ చేశామని వివరించారు. శిబిరంలో కళ్లజోళ్లు అవసరమని నిర్ధారణ అయిన వారికి కేవలం ఏడు రోజుల్లోనే వారి లోపం ఆధారంగా సిద్ధం చేసి అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
దివ్యాంగులకు ట్రై సైకిల్స్, కంటి పరీక్షలు
కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన దివ్యాంగురాలు రజియా సుల్తానాకి ట్రై సైకిల్ బహూకరించి, కంటి పరీక్షలు చేయించినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు అంబటి మురళీకృష్ణ తెలిపారు. కంటి పరీక్ష కోసం వచ్చిన దివ్యాంగుడు తాళ్లూరి ఏసోబుకి కూడా ట్రై సైకిల్ బహూకరిస్తామని ప్రకటించారు. ఈ శిబిరంలో గుంటూర ట్రైకాన్ క్లినిక్స్ వారి సహకారంతో గ్రామంలోని 51మందికి ఫిజియోథెరపీ సేవలు అందించారు. వృద్ధులు, మహిళలు, వికలాంగులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, శిబిరానికి వారి రాకపోకలకు ప్రత్యేక వాహనాలను కూడా ఏర్పాటు చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
బజరంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అంబటి మురళీకృష్ణ కొత్త రెడ్డిపాలెం, పాత రెడ్డిపాలెం గ్రామాల్లో బజరంగ్ నేత్ర జ్యోతి వైద్య శిబిరం 903 మందికి నేత్ర వైద్య పరీక్షలు, అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు

దివ్యాంగురాలు రజియా సుల్తానాకు ట్రై సైకిల్ బహూకరణ