రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

Nov 14 2026 12:29 AM | Updated on Nov 14 2026 12:29 AM

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణ సమీపంలోని బొబ్బిలిపేట జంక్షన్‌ వద్ద సీఎస్పీ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు, ఎస్‌ఐ సనపల బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. జలుమూరు మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన పుట్ట ఆదినారాయణ (23) ఆమదాలవలస మండలం నిమ్మతొర్లాడ గ్రామంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. బొబ్బిలిపేట జంక్షన్‌ వద్దకు చేరుకోగానే పాలకొండ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో అదుపుతప్పి రోడ్డుపై బలంగా పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement