బుధవారంపేటలో చోరీ | - | Sakshi
Sakshi News home page

బుధవారంపేటలో చోరీ

Nov 14 2026 12:29 AM | Updated on Nov 14 2026 12:29 AM

బుధవారంపేటలో చోరీ హంస వాహనం సిద్ధం ● 21న ఆదిత్యుని తెప్పోత్సవానికి ఏర్పాట్లు బూర్జలో ఆరు పూరిళ్లు దగ్ధం

ఎచ్చెర్ల : బుధవారంపేట గ్రామంలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేజేటి సీతారామమ్మ తన సోదరితో కలి సి నివాసముంటోంది. ఇద్దరూ కలిసి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో బంధువుల ఇంటికి దసరా ముందు వెళ్లారు. శుక్రవారం నాగుల చవితి సందర్భంగా పుట్టల్లో పాలు పోసేందుకు అటు వైపుగా వెళ్లిన బంధువులు సీతారామమ్మ ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటం గమనించారు. వెంట నే ఆమె సోదరుడు గుహానంద్‌కు తెలియజేశారు. అప్పటికే ఇంట్లో 2 కిలోల వెండి వస్తువులు దొంగత నం జరిగినట్లు గుర్తించారు. గుహానంద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ జి.లక్ష్మణరావు, క్లూస్‌ టీమ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బెడ్‌రూమ్‌లో రెండు బీరువాలను పగలగొట్టి చోరీకి పాల్పడినట్లు గు ర్తించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఈనెల 21న హంసనావికోత్సవం (తెప్పో త్సవం) కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నా యి. అయితే నగరంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న కారణంగా రాజకీయ హడావుడి లేకుండానే ఈ తెప్పోత్సవాన్ని జరిపించేలా ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్‌, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ చర్యలు చేపడుతున్నారు. అలాగే ఆలయ పాలకమండలి సభ్యుల జోక్యం కూడా ఉండే అవకాశాలు లేకపోవడంతో ఏర్పాట్ల విషయంలో అంతా అధికారిక సూచనల మేరకు మాత్రమే జరుగుతున్నాయి. ఇక ఇంద్రపుష్కరిణి పునర్నిర్మాణ పనులు కూడా జరుగుతున్న క్రమంలో తెప్పోత్సవానికి ఇబ్బంది లేకుండా భక్తులకు అనుమతి లేకుండా ఒడ్డుకు దూరం నుంచే హంసనావికోత్సవాన్ని తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

బూర్జ : మండలం కేంద్రం బూర్జలో శుక్రవారం ఉద యం జరిగిన అగ్ని ప్రమా దంలో ఆరు పూరిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామస్తులంతా నాగులు చవితి సందడిలో ఉండగా తెలగ వీధిలో తిరుమలరెడ్డి శివశంకర్‌ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.కొద్దిసేపటికే పక్కనే ఉన్న రావూరి లక్ష్మీనారాయణ, బల్ల చాకలి, రావూరి కుమారస్వామి,అల్లు ముఖలింగం, తిరుమలరెడ్డి సూర్యారావులకు చెందిన పూరిళ్లకు మంటలు వ్యాపించాయి. స్థానికులు వెంటనే పాలకొండ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement