టైలరింగ్‌లో ఉచిత శిక్షణ | - | Sakshi
Sakshi News home page

టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

Nov 14 2026 12:29 AM | Updated on Nov 14 2026 12:29 AM

టైలరింగ్‌లో ఉచిత శిక్షణ రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య జాతీయ స్థాయి క్రికెట్‌ పోటీలకు పాతపట్నం విద్యార్థిని కార్యాలయంలోకి నాగుపాము టెక్కలిలో నాగుపాము కలకలం పోస్టాఫీసులో అగ్ని ప్రమాదం

ఎచ్చెర్ల : ఎచ్చెర్లలోని యూనియన్‌ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో ఈ నెల 23 నుంచి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నిరుద్యోగ మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయని సంస్థ డైరెక్టర్‌ రామ్‌జీ తెలిపారు. ఈ మేరకు శుక్రవా రం ఒక ప్రకటన విడుదల చేశారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పి స్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9553 410809, 7993340407 నంబర్లను సంప్రదించాలని కోరారు.

టెక్కలి రూరల్‌: నౌపడ ఆర్‌ఎస్‌ రైల్వే గేటు సమీపంలో శుక్రవారం రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకు ని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు గోవిందపురం గ్రామానికి చెందిన కె.రామారావు(35)గా గుర్తించారు. టెక్కలి మండాపొలం కాలనీలో ఉన్న తన అత్తవారింకి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్నపాటి తగాదా కారణంగా మనస్థా పానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొ న్నారు. అనంతరం మృతదేహాన్ని టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

పాతపట్నం: జాతీయ స్థాయి క్రికెట్‌ పోటీలకు ఆంధ్రప్రదేశ్‌ జట్టు తరఫున పాతపట్నంకు చెందిన జంజిక నవదీష ఎంపికై నట్లు పీఈటీ, కోచ్‌ లోకేష్‌ శుక్రవారం తెలిపారు. ఇటీవల రాష్ట్ర స్థాయి క్రికెట్‌ అండర్‌–17 బాలికల విభాగంలో కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన పోటీల్లో కీపర్‌గా, బ్యాటర్‌గా నవదీష ప్రతిభ కనబర్చింది. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌జీఎఫ్‌ఐ) జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రంలో జాతీయ స్థాయి క్రికెట్‌ పోటీల్లో ఏపీ జట్టు తరఫున కీపర్‌, బ్యాటర్‌గా నవదీష పాల్గొననుంది. ఈమె తండ్రి జంజిక శ్రీనువాసరావు పీఈటీ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. పాతపట్నం సెయింటాన్స్‌ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. నవదీషను పీడీలు శేఖర్‌బాబు, శ్రీనుబాబు, క్రిష్ణారావు, రాజ్యలక్ష్మిలు అభినందించారు.

కంచిలి: మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం నాగుపాము ప్రవేశించింది. కీలక ఫైళ్లు భద్రపరిచే గదిలోకి చేరడంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. నాగులచవితి రోజున పాము రావడంతో వెంటనే పాములపట్టే వ్యక్తి సాయంతో పట్టుకుని గ్రామం బయట విడిచిపెట్టారు.

టెక్కలి: టెక్కలిలో నాగుల చవితి ముందు రోజు గురువారం రాత్రి ఓ ఇంట్లో నాగు పాము కలకలం రేపింది. స్థానిక నవీన్నగర్లో లాడి కామేశ్వరరావు ఇంట్లోకి నాగు పాము చొరబడింది. గమనించిన కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు.

టెక్కలి రూరల్‌ : టెక్కలి అంబేడ్కర్‌ జంక్షన్‌ వద్ద పోస్టాఫీసులో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. కార్యాలయం తలుపులు వేస్తున్న సమయంలో పాత ఫైల్స్‌ నుంచి పొగరావడాన్ని సిబ్బంది గుర్తించారు. అప్పటికే పాత రికార్డులు కాలిపోతున్నట్లు గమనించి వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన చేరుకుని మంటలను అదుపుచేశారు. సమీప ప్రాంతంలో బాణసంచా కాల్చడం వల్ల నిప్పురవ్వలు ఎగిరి పడటంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. రాత్రి సమయంలో ప్రమాదం జరిగిఉంటే రికార్డులు మొత్తం కాలిపోయేవని సిబ్బంది తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement