బొరిగుమ్మ – రాణిగుడ – కొరాపుట్‌ రోడ్డు మూసివేత | - | Sakshi
Sakshi News home page

బొరిగుమ్మ – రాణిగుడ – కొరాపుట్‌ రోడ్డు మూసివేత

Nov 4 2026 2:08 AM | Updated on Nov 4 2026 2:08 AM

జయపురం: బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాన్‌ కారణంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండడం వలన బొరిగుమ్మ – కొరాపుట్‌ మార్గంలో రాణిగుడ సమీప ఘాట్‌లో కొండ చరియలు నుంచి మట్టిజారుతోంది. దీంతో జయపురం సబ్‌ డివిజన్‌ బొరిగుమ్మ నుంచి రాణిగుడ మీదుగా కొరాపుట్‌ వరకు గల ఉన్న రోడ్డును మూసివేస్తున్నట్లు జిల్లా అధికార యంత్రాంగం వెల్లడించింది. రాణిగుడ ప్రాంతంలోని ఘాట్‌ మార్గంలో వర్షాలకు కొండచరియలు విరిగిపడడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అందువలన బొరిగుమ్మ నుంచి కొరాపుట్‌ వైపు వెళ్లాల్సిన వాహనాలు, ప్రజలు బొరిగుమ్మ – జయపురం మీదుగా వెళ్లాలని సూచించారు.

కాలువలో మునిగి

వృద్ధురాలు మృతి

మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల పోలీసుస్టేషన్‌ పరిధి గంపాకొండ ప్రధాన కాలువలో మునిగి ఒక వృద్ధురాలు మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం ఉదయం ఎంవీ 105 గ్రామం వద్ద మహిళ మృతదేహాన్ని చూసి వెంటనే స్థానికులు కలిమెల పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఐఐసీ ప్రభుదత్త తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని బయటకు తీసి పరిశీలించారు. మృతురాలు చింతల్వాడ పంచాయతీ మాజిగూడ గ్రామానికి చెందిన భీమా మాడ్కమి (68)గా గుర్తించారు. అయితే ఆమె తన భర్త ఉంగతో కలిసి సోమవారం పొంలం పనికి వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్తున్న సమయంలో స్నానానికి వెళ్లి కాలుజారి పడిపోయింది. నీరు ఎక్కువగా ఉండడంతో ఆమె గల్లంతయ్యింది. మంగళవారం ఒక చెట్టు కొమ్మకు తగిలి ఎంవీ 105 గ్రామం వద్ద తేలింది. ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

విస్తారంగా వర్షాలు

మల్కన్‌గిరి: జిల్లాలో మురసు ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. పలు ప్రాంతాల్లో పునరావాసు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. చిత్రకొండ ఘాట్‌ రోడ్డులో కొండ చరియలు పడినచోట జేసీబీతో క్లియర్‌ చేశారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా పునరావాసు కేంద్రాల్లో జనరేటర్స్‌ అందుబాటులో ఉంచారు.

నూతన కార్యవర్గం ఏర్పాటు

రాయగడ: స్థానిక వాకర్స్‌ క్లబ్‌కు నూతన కార్యవర్గం ఏర్పాటయ్యింది. న్యాయవాది బ్రజసుందర్‌ నాయక్‌ అధ్యక్షతన నిర్వహించిన బోర్డ్‌ ఆఫ్‌ డైరక్టర్స్‌ సమావేశంలో ఈ ఎంపిక జరిగింది. ఈ సమావేశంలో క్లబ్‌ సలహాదారుడు సత్యవాది పతి ప్రారంభ సూచనలు చేస్తూ క్లబ్‌ కార్యక్రమాల్లో క్రమం తప్పకుండా పాల్గొనే సభ్యులకు కార్యవర్గంలో ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ఆయన సూచన మేరకు సభ్యులందరూ ఏకాభిప్రాయంతో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. వచ్చే ఏడాదికి గానూ క్లబ్‌ అధ్యక్షుడిగా జలంధర్‌ పుసిక, సాధారణ కార్యదర్శిగా ఆనంద్‌ సేనాపతి, కోశాధికారిగా రామచంద్ర సాహుకార్‌, తొలి ఉపాధ్యాక్షుడిగా రుద్ర ప్రసాద్‌ చౌదరి, రెండో ఉపాధ్యక్షుడిగా మనోజ్‌ గంతాయిత్‌లు నియమితులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement