‘నీటిని పొదుపు చేయండి’ | - | Sakshi
Sakshi News home page

‘నీటిని పొదుపు చేయండి’

Nov 4 2026 2:08 AM | Updated on Nov 4 2026 2:08 AM

‘నీటిని పొదుపు చేయండి’

రాయగడ: ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే రాయగడ డివిజన్‌ పరిధిలో బీఆర్‌ఐసీఎస్‌ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా మంగళవారం వివిధ రైల్వేస్టేషన్లలో నీటిని పొదుపు చేయండి అనే నినాదంతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా రైల్వే ఉద్యోగులు, ప్రయాణికులకు నీటి సంరక్షణ ప్రాధాన్యత, నీటి వృథాను నివారించడం, రోజువారీ జీవితంలో బాధ్యతాయుతంగా నీటిని వినియోగించుకోవడంపై అవగాహన కల్పించారు. డీఆర్‌ఎం అమితాబ్‌ సింఘాల్‌ మాట్లాడుతూ నీరు అమూల్యమైన సహజ వనరని, దాని సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. నీటి వృథాను అరికట్టడంతో పాటు అవసరానికి తగినవిధంగా నీటిని వినియోగించాలని సూచించారు. భవిష్యత్‌ తరాలకు ఈ విలువైన వనరును అందించేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని రైల్వే ఉద్యోగులు, ప్రయాణికులకు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement