తుఫాన్‌ నష్టం అంచనాకు కేంద్రబృందం | - | Sakshi
Sakshi News home page

తుఫాన్‌ నష్టం అంచనాకు కేంద్రబృందం

Nov 4 2026 2:08 AM | Updated on Nov 4 2026 2:08 AM

తుఫాన్‌ నష్టం అంచనాకు కేంద్రబృందం

పర్లాకిమిడి: అర్నబ్‌ తుపాను అనంతరం గజపతి జిల్లాలో నష్టాన్ని అంచనా వేసేందుకు, పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం కేంద్ర బృందం మంగళవారం పర్యటించింది. బెత్తగుడ పోలీసు గ్రౌండ్స్‌లో ఎనిమిది మంది సభ్యులకు ఏడీఎం ఫల్గునీ మఝి, జిల్లా పరిషత్‌ సీడీవో దయామయ పాఢి స్వాగతం పలికారు. బృందంలోని సభ్యులు కలెక్టరేట్‌లో కలెక్టర్‌, ఇతర ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో అర్నబ్‌ తుపాను ప్రభావంతో జిల్లాలో పంటనష్టం, ఇళ్లు, రోడ్డు, భవనాలు, హైవేల నష్టంపై ఫొటో పవర్‌ ప్రెజెంటేషన్‌లో గంటసేపు సమీక్షించారు. సమావేశం అనంతరం కేంద్ర బృందం నేరుగా సర్క్యూట్‌ హౌస్‌కు వెళ్లి అక్కడ నుంచి రాయగడ, నువాగడ, మహేంద్రగడ, మోహానా బ్లాక్‌లలో తుపాను వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేశారు. కేంద్ర బృందం వెంట కలెక్టర్‌ అక్షయ్‌ సునీల్‌ అగర్వాల్‌, సబ్‌ కలెక్టర్‌ భాగవత్‌ సామల్‌ కల్యాణ్‌ రావ్‌, జిల్లా పరిషత్‌ అధికారి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ అభిషేక్‌ శెఠి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement