మల్కన్‌గిరి: జిల్లాలోని బలిమెల పోలీసుస్టేషన్ పరిధి ఎంవీ 36 గ్రామంలో రాబేంద్రనాథ్ సర్కార్, ఆయన భర్య రేభా సర్కార్‌ను అదే గ్రామానికి చెందిన బిశంకర్ మండాల్ అనే వ్యక్తి గొడలితో దాడి చేసి హత్యలు చేసిన విషయం తెలిసిందే. దాడిలో వాళ్ల 15 ఏళ్ల కుమారుడు సందీప్ సర్కార్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో మల్కన్‌గిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సందీప్‌ను ఎమ్మెల్యే నర్సింగ్ మంగళవారం పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి బాలుడి ఆరోగ్యంపై చర్చించారు. అనంతరం కోరుకొండ సమితి సోమానాథ్పూర్ పంచాయతీ ఎంవీ 36 గ్రామానికి వెళ్లి హత్యపై గ్రామస్తులతో చర్చించారు. కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.


