నిషా ముక్త అభియాన్‌పై సమావేశం | - | Sakshi
Sakshi News home page

నిషా ముక్త అభియాన్‌పై సమావేశం

Nov 2 2026 2:11 AM | Updated on Nov 2 2026 2:11 AM

పర్లాకిమిడి: గజపతి జిల్లా గుమ్మాబ్లాక్‌ సెరంగో పోలీసుస్టేషన్‌లో నషాముక్త అభియాన్‌ అవగాహన సమావేశం అమొ పోలీసు సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. సమావేశంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు ఏజెన్సీలో పండించడం నేరమని, ప్రత్నామ్యాయ వ్యవసాయ సాగు పద్ధతుల ద్వారా జీవనోపాధి ఎంచుకోవాలని సర్పంచ్‌ ప్రదీప్‌కుమార్‌ మండల్‌ కోరారు. సమావేశంలో భుభుని పంచాయతీ సర్పంచ్‌ రేణుకా గోమాంగో తదితరులు పాల్గొన్నారు.

శంకర్‌ ప్రసాద్‌ భక్షి సేవలు చిరస్మరణీయం

పర్లాకిమిడి: విద్యా రంగానికి మహిళా డిగ్రీ ఉన్నత మాధ్యమిక విద్యాలయం విశ్రాంత ప్రిన్సిపాల్‌ దివంగత శంకర్‌ ప్రసాద్‌ భక్షి చేసిన సేవలు చిరస్మరణీయమని వక్తలు పేర్కొన్నారు. ఆయన సంతాప సమావేశాన్ని స్థానిక శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాల పూర్వ విద్యార్థి సంఘం అతిథి భవనంలో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్‌ ప్రొ.రాధాకాంత భుయ్యాన్‌, అధ్యక్షుడు నృసింహా చరణ్‌ పట్నాయిక్‌, కార్యదర్శి ఆదర్శ దాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

నిర్లక్ష్యం చేసిన పంటలపై చర్చ

జయపురం: మనం మరచిపోయిన సాంప్రదాయ ఆహారాలు, నిర్లక్ష్యం చేస్తున్న ప్రాచీన పంటలపై ఒక పోకస్‌ గ్రూపు సభ్యులు శుక్రవారం చర్చా సమావేశం నిర్వహించారు. జయపురం సబ్‌ డివిజన్‌ బొయిపరిగుడ సమితి దొరాగుడ పంచాయతీ సమితి బెంధ్రాగుడ గ్రామంలో ఫోకస్‌ ట్రూపు నిర్వహించిన ఈ కార్యక్రమంలో బొయిపరిగుడ సమితి వ్యవసాయ విభాగ అధికారి, స్కీమ్‌ అధికారి, జిల్లా ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌లు ఆరోగ్యకరమైన పౌష్టికాహారాలను మనం మరచిపోయామని, పాశ్చాత్యుల అలవాటులకు బానిసలు అవుతూ అనారోగ్య బాటలో నడుస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రిసెర్చ్‌ ఫెలోస్‌ పలువరు వ్యవసాయ విభాగ అధికారులు పాల్గొని తమతమ అభిప్రాయాలను వెల్లడించారు.

పట్టుబడిన

16 ద్విచక్ర వాహనాలు

పర్లాకిమిడి: పట్టణంలో బుల్లెట్‌ వాహనాల సైలెన్సర్లు మార్చివేసి నడుపుతున్న మోటారు సైకిళ్లను పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు. మొత్తం ఒడిశా, ఆంధ్రా రిజిస్ట్రేషన్‌కు చెందిన 16 బుల్లెట్స్‌, స్కూటీలను స్వాధీనం చేసుకుని మోడల్‌ పోలీసుస్టేషన్‌లో ఉంచారు. అందులో 6 మోటారు సైకిళ్లకు హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్స్‌, ఇన్సూరెన్సులు కూడా లేవని ఐఐసీ ప్రశాంత భూపతి తెలియజేశారు. పట్టణంలో పట్టుబడిన మోటారు సైకిళ్ల సైలెన్సర్లను మార్చి ఎక్కువ సౌండ్‌తో ఉన్నవి పెట్టడంతో అధిక సౌండ్‌ పొల్యూషన్‌ వస్తుందని, అందువల్ల ఎంవీఐ చట్టం కింద కేసు నమోదు చేసి ఆర్‌టీవోకు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement