గిరిజన విద్యాభివృద్ధికి ముందడుగు | - | Sakshi
Sakshi News home page

గిరిజన విద్యాభివృద్ధికి ముందడుగు

Nov 2 2026 2:11 AM | Updated on Nov 2 2026 2:11 AM

రాయగడ: జిల్లాలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు గిరిజన, వెనుబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో జిల్లాకు మొత్తం 173 మందిని కొత్తగా నియమించింది. వీరిలో 147 మంది సేవకులు, సేవికలు కాగా.. మరో 26 మంది భాషా ఉపాధ్యాయులు ఉన్నారు. భువనేశ్వర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి, రాయగడ జిల్లాకు చెందిన 70 మందికి నియామకపత్రాలు అందజేశారు. మిగిలిన 103 మందికి రాయగడ కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి జిల్లా యంత్రాంగం తరుపున నియామక పత్రాలను అందజేశారు. నూతనంగా నియమితులైన అభ్యర్థులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్రస్థాయి కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వీక్షించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి అసీమా రావ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, అది గొప్ప సామాజిక సేవా కార్యక్రమమని పేర్కొన్నారు. ముఖ్యంగా గిరిజన, మారుమూల ప్రాంతాల్లోని తొలితరం విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement