పర్లాకిమిడి: గంజాం జిల్లా అర్నబ్ తుపాను బాధితులకు గజపతి జిల్లా గుసాని సమితి తరపున 1,410 రిలీఫ్ ప్యాకెట్లను ఆదివారం గుసాని నుంచి ఒక వాహనంలో గంజాం కలెక్టరేట్‌లో అధికార యంత్రాంగానికి అందజేసినట్లు గుసాని పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బినోద్ గౌడో తెలియజేశారు. ప్రతీ రిలీఫ్ ప్యాకెట్‌లో రెండు కిలోల అటుకులు, బెల్లం 150 గ్రా, కొవ్వొత్తులు 2, బిస్కెట్ ప్యాకెట్స్ 2, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు 4, అగ్గిపెట్లు 2 ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ తుపాను సహాయం పంపినవారిలో గుసాని బీడీవో గౌరచంద్ర పట్నాయిక్, జీపీడీవో ఎ.దేవగిరి ప్రసాద్‌రావు, బీఎఫ్‌వో గజేంద్ర బెహరా, ఎంఐ జీవన్ జ్యోతి పాణిగ్రాహి ఉన్నారు. అలాగే పర్లాకిమిడి పురపాలక సంఘం ఇన్‌చార్జి అధికారి, సబ్ కలెక్టర్ భగవత్ సామల్ కల్యాణ్ రావ్ ఒక మినీ ట్రక్కుతో బెల్లం, అటుకులు, కొవ్వొత్తులు, ఇతర నిత్యావసర ప్యాకెట్లను గంజాం కలెక్టర్‌కు పంపారు.


