మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం అవినీతి నిరోధక వారోత్సవాల నిర్వహణపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు సమగ్రతతో సమృద్ధి అనే ఇతివృత్తంతో జిల్లా వ్యాప్తంగా అవినీతి నిరోధక అవగాహన వారోత్సవాలను నిర్వహించనున్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య అభివృద్ధి అధికారి దశరథి సరాబు, సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి, విజిలెన్స్ డీఎస్పీ సదానంద పాణి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ డబ్బు స్వాహా చేసిన ఇద్దరు అరెస్టు
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కుంద్ర సమితి బనువగుడ గ్రామ పంచాయతీలో గతంలో గ్రామీణ రోజ్‌గార్ పథకం కింద ఉద్యోగి, డాటా సెంటర్ ఆపరేటర్‌గా పనిచేసిన జి.శంకర్, పనులను నిర్వహించిన మేట్ లయిచన్ నాయిక్ లను జయపురం విజిలెన్స్ అధికారులు శనివారం అరెస్టు చేశారు. వారిద్దరూ రూ.12,33,435 ప్రభుత్వ డబ్బు స్వాహా చేసినట్లు ఆరోపణలు రావడంతో వారిని అరెస్టు చేశారు. 2024లో కుంద్ర సమితి బనువాగుడ గ్రామ పంచాయతీలో మహాత్మా గాంధీ నిశ్చిత ఉపాధి కల్పన పథకంలో పనులు చేపట్టగా.. ఒక ప్రాజెక్టు చేయకుండానే చేసినట్టు చూపి డబ్బులు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణపై కొరాపుట్ ప్రాంతీయ విజిలెన్స్ విభాగం జయపురం వారు దర్యాప్తు జరిపి వారిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.
సారా కేంద్రాలపై దాడులు
పర్లాకిమిడి: గజపతి జిల్లా ఎస్పీ మీనా ఆదేశాల మేరకు కాశీనగర్ బ్లాక్ కె.సీతాపురం పంచాయతీ సింగిపురం గ్రామంలో ఆదివారం ఉదయం ఆదర్శ ఠాణా పోలీసు అధికారి ప్రశాంత భూపతి, సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక దాడులు చేపట్టి వంటసారా, ఇతర సామగ్రి పట్టుకున్నారు. కె.సీతాపురం పంచాయతీలో అక్రమం సారా వంటలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో పోలీసుల బృందం సింగిపురంలో దాడులు జరిపి 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. సింగిపురంలో 875 కిలోలు (35 బస్తాలు) విప్పసారా, వంద లీటర్ల నాటు సారా, రెండు అల్యూమినియం బేసిన్లు, ఐదు మట్టి కుండలు, ఇతర సారా తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులపై పర్లాకిమిడి మోడల్ పోలీసు స్టేషన్‌లో ఎకై ్సజ్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ ప్రియంబత స్వయిని, ఏఎస్‌ఐ జగారంగ, కె.సీతాపురం రెవెన్యూ అధికారి, ఏపీఆర్ పోలీసులు సమక్షంలో నిందితులు, ఇతర సామగ్రిని పర్లాకిమిడి స్టేషన్‌కు తరలించారు.


