జయపురం: అర్ధరాత్రి ఇంటి తలుపులు తట్టి పోలీసులం అని చెప్పి ఇంటి లోపలకు వెళ్లి ఇంటిలోని వారిని కొట్టి ఇంటిలో ఉన్న బంగారు నగలు, డబ్బు దోచుకుపోయినట్లు బొయిపరిగుడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఈ సంఘటన బాధితులు బొయిపరిగుడ సమి తి దసమంతపూర్ గ్రామ పంచాయతీ ఉచ్చలగుడ గ్రామం సోమనాథ్ ఖిలో కుటుంబం. సోమనాథ్ ఖిలో బొయిపరిగుడ పోలీసు స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. గత అర్ధ రాత్రి ఐదుగురు వ్యక్తులు తమ ఇంటికి వచ్చి తలుపు తట్టారని, ఆ సమయంలో తాను తన భార్య నిద్ర పోతున్నామని వెల్లడించారు. తలుపు తట్టి న శబ్దం రాగా తాను వెళ్లి తలుపు తీసి ఎవరు అని ప్రశ్నించగా వారు పోలీసులం అని చెప్పి వారు ఇంటిలో ప్రవేశించారని, తనను తన భార్యను తీవ్రంగా కొట్టి తమ వద్ద గల అర తులం బంగారం, రూ.10,800 నగదు దోచుకు ని పోయారని పేర్కొన్నారు. పోలీసులు వెంటనే గ్రామానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు.
భక్తిశ్రద్ధలతో గౌరీపౌర్ణమి
పర్లాకిమిడి: కుమార పౌర్ణమి పండగ సందర్భంగా పట్ణణంలో 14, 15వ వార్డులు గొల్ల, ఖంజా వీధిల్లో మహిళలు భక్తిశ్రద్ధలతో గౌరీదేవికి పూజలు చేశారు. గౌరీపౌర్ణమి మహిళల పండుగ, ముత్తయిదవులకు అతిథులుగా ఆహ్వానించి వారికి వాయనాలు అందజేశారు. కొన్ని వీధుల్లో నందెమ్మ ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభించారు. సోమవారం నుంచి సాయంత్రం నందెమ్మలను ఊరేగిస్తారు. గౌరీదేవికి పూజలు చేసిన అనంతరం గవ్వలతో ఆడతారు. కొన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలైన బుర్రకథ, హరికథ కాలక్షేపం చేస్తారు.


