132 మందికి వైద్య పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

132 మందికి వైద్య పరీక్షలు

Oct 26 2026 3:16 AM | Updated on Oct 26 2026 3:16 AM

రాయగడ: మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా జిల్లాలోని రామనగుడ సమితిలోని టాస్కీ గ్రామంలో ఏకల్‌ అభియాన్‌ ఆరోగ్య శిక్ష ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన, వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఏకల్‌ ఆరోగ్య అభియాన్‌ శిక్ష విభాగం, వనబంధు పరిషత్‌ సహకారంతొ సుండిధాముని పంచాయతీ పరిధిలోని ఈ కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. ఈ శిబిరంలో మొత్తం 132 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సంఘ్‌ అధ్యక్షుడు గంగారం మండంగి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా సర్పంచ్‌ భాస్కర కడ్రక, గతివిధి ప్రముఖ్‌ కుముటి మాఝి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ముఖ్య వైద్య ఆరోగ్యశాఖ అధికారి సహకారంతో రామనగుడ పీహెచ్‌సీ వైద్యుడు ప్రభాత్‌ కుమార్‌ దాస్‌, వైద్య సిబ్బంది శిబిరంలో చురుగ్గా పాల్గొన్నారు. స్థానిక ఆశ, ఆరోగ్య కార్యకర్తలు, ఎకల్‌ అభియాన్‌ రాయగడ జిల్లా సమన్వయకర్త, టాస్కీ సేవ బస్తీ ఆచార్యులు తదితరులు సహకరించారు. ఈ వైద్య శిబిరంలో గ్రామస్తులకు వివిధ వ్యాధులపై అవగాహన కల్పించడంతోపాటు రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు, హిమోగ్లోబిన్‌, మలేరియా తదితర పరీక్షలను నిర్వహించారు. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, వాత సంబంధిత సమస్యలు, రక్తహీనత, అధిక రక్తపోటు వంటి సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించి, వారి అవసరాలకు అనుగుణంగా ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement