నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

Oct 26 2026 3:16 AM | Updated on Oct 26 2026 3:16 AM

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి పోట్టేరు నదిలో ఆదివారం ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఎంపీవీ 64 గ్రామం వద్ద నది వద్దకు స్థానికులు కాలకృత్యాల కోసం వెళ్లగా ఓ మృతదేహం కనిపించింది. వెంటనే స్థానికులు కలిమెల పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అగ్నిమాపక సిబ్బంది సాయంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. అప్పటికే మృతదేహం పాడైపోయి ఉంది. మృతునికి 60 ఏళ్లు ఉండవచ్చని భావిస్తున్నారు. మిస్సింగ్‌ కేసులు ఏమైనా ఉన్నాయేమోనని వెతుకుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement