గార: వంశధార కుడి కాలువలో లింగాలవలస, అంపోలు మధ్య 33ఆర్ వద్ద కొత్తగా కాలువ తవ్వకం చేపట్టారు. దీంతో శివారు ప్రాంతానికి సాగునీరు కష్టంగా మారుతోందని మెండపేట, చల్లపేట రైతాంగం వంశధార అధికారులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే సాగునీరందడం లేదని, ఇలా ఇష్టానుసారంగా కాలువ తవ్వితే మరింత ఇబ్బందులొస్తాయని శివారు ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం డీఈ బి.సత్యనారాయణ, సిబ్బందితో చేరుకొని పనులు నిలిపివేశారు. అధికారులకు సమాచారం ఇవ్వకుండా కాలువ తవ్వితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం కాలువ వద్ద అడ్డుగా గట్టు వేశారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ అధికారులకు కొత్త కాలువ కోసం దరఖాస్తు చేస్తే సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఉన్నతాధికారులు అనుమతిలిస్తారని స్పష్టం చేశారు.


