● స్కూల్‌గేమ్స్ రైఫిల్ షూటింగ్, నెట్‌బాల్‌లో ముగిసిన ఎంపికలు ● భారీగా తరలివచ్చిన క్రీడాకారులు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి స్కూల్‌గేమ్స్ ఎంపిక పోటీలు ఆదివారం ఉత్సాహభరితంగా సాగాయి. జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో రైఫిల్ షూటింగ్‌తోపాటు నెట్‌బాల్ క్రీడాంశాల్లో సెలక్షన్ ట్రయల్స్ పూర్తిచేశారు. ఈ ఎంపికలకు క్రీడాకారులు పోటెత్తారు. ముఖ్యంగా నెట్‌బాల్ ఎంపికలకు వందలాది మంది క్రీడాకారులు హాజరై ప్రతిభ నిరూపించుకున్నారు. రైఫిల్ షూటింగ్ ఎంపికలను శ్రీకాకుళంలో నిర్వహించగా, నెట్‌బాల్ ఎంపికలను టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వేదికగా నిర్వహించారు. రాష్ట్ర స్కూల్‌గేమ్స్ పోటీలకు ఎంపికై న క్రీడాకారులతో కూడిన జిల్లా జట్లను ఖరారుచేశారు. ఎంపికై న క్రీడాకారులంతా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్రపోటీలకు సన్నద్ధంకావాల్సి ఉంటుంది.
నిరంతర సాధనతో లక్ష్య ఛేదన..
క్రీడాకారులు నిరంతర సాధనతో తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను ఛేదించవచ్చని.. క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాణించి జిల్లా ఖ్యాతిని చాటాలని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి చల్లా జగదీష్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని హరీష్ షూటింగ్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి రైఫిల్ షూటింగ్ ఎంపికల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం ఎంపికై న క్రీడాకారుల జాబితాను వెల్లడించారు. రాష్ట్రపోటీలకు మోహిత్ కృష్ణ భాస్కర్, ఎం.త్రిలోచన్, ఎస్.లక్ష్మీ చేతన్, పి.రస్మిత, ిసీహెచ్ తమన్ రామసాయి ఎంపికయ్యారని ప్రకటించారు. కార్యక్రమంలో రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి.టి.హరీష్‌కుమార్, శిక్షకుడు మల్లారెడ్డి చక్రవర్తి పాల్గొన్నారు.
బేస్‌బాల్‌కు పోటెత్తారు..
శ్రీకాకుళం జిల్లా స్కూల్ గేమ్స్ నెట్‌బాల్ ఎంపికలకు క్రీడాకారులు భారీస్థాయిలో పాల్గొన్నారు. టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అండర్ –14, అండర్ –17, అండర్ –19 విభాగాల్లో బాలబాలికలకు వేరువేరుగా ఎంపికలను నిర్వహించారు. ఎస్‌జీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, డీఈఓ ఎ.రవిబాబు, ఆర్గనైటింగ్ సెక్రటరీలు చల్లా జగదీష్, జీఎం జ్యోతిరాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంపికలకు 75 పాఠశాలల నుంచి 325 మంది బాలబాలికలు పాల్గొన్నారు. ఆర్గనైజేషన్ సెక్రటరీ బాడాన నారాయణరావు, కె.రఘునాథ్‌రావు, ఎన్.జనార్దనరావు, కె.కె.రామిరెడ్డి, పర్యవేక్షణలో విభాగాల్లో 72 మందితో కూడిన జిల్లా జట్లను ఎంపికచేశారు. కార్యక్రమంలో ఎస్.లక్ష్మణరావు, జి.శ్రీనివాసరావు, ఎన్.రమేష్, కే.ప్రకాష్, వై.వెంకటరమణ, జైకృష్ణ, రఘురామ్, జి.నాగరాజు, బీ.టీవెంకటేశ్వరరావు, రామారావు, తిరుపతిరావు, లోకనాథం, జగదీష్, శైలజ, ప్రియాంక, నీరజ, ప్రశాంతి, నాగరత్నం, రవణమ్మ, భారతి, సీతయ్య, లోకేశ్వరరావు, అజయ్ తదితరులు పాల్గొన్నారు.


