మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తుఫాన్‌గా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరుకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు మల్కన్‌గిరి జిల్లా యంతాగం ఉన్నాతాధికారులతో సమావేశన్ని నిర్వహించారు. జిల్లా కలేక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజాశిర్కే ఆదేశాల మేరకు జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ అధ్యక్షత వహించారు. అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రధాన్, జిల్లా పరిషత్ ముఖ్య అభివృద్ధి అధికారి దశరాథి సరాబు, సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి, జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ రశ్మిరంజన్ సేనపతి, జిల్లా అత్యవసర విభాగం అధికారి దీప్తి రంజన్ సాహు తదితరులు హాజరై లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లపై చర్చించారు. ఆస్పత్రుల్లో అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని, మొబైల్ వైద్య బృందాలను సిద్ధంగా ఉంచాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలతోపాటు అగ్నిమాపిక సిబ్బందిని కూడా అప్రమత్తంగా ఉంచారు. తుఫాన్ ప్రభావంతో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వెంటనే స్పందించేలా సర్వం సిద్ధం చేశారు.


