మల్కన్‌గిరి: మల్కన్‌గిరి భారతీయ స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో శనివారం మేనేజర్ వినోద్ కుమార్ బిశోయి, కేంద్ర ప్రఽభుత్వ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద భీమరంగిణి గ్రామానికి చెందిన హరతి సోడికు రూ. 2 లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కేశవ్ సిసా, ఫీల్డ్ ఆఫీసర్ సామ్య రంజన్ బెహర, అకౌంటెంట్ ఛాయకాంత్ ఛత్రియా, నర్సింగ్ సాహు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలను ఈ కార్యక్రమం ద్వారా చాటుకుంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద పథకం నిబంధనలు, షరతలకు అనుగుణంగా ప్రమాదవశాత్తు మరణ, లేదా నిర్ధిష్ట రకాల వైకల్యాలకు గరిష్టంగా రూ. 2 లక్షలు ప్రమాద బీమా వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు.


