గజపతిని కరువు జిల్లాగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

గజపతిని కరువు జిల్లాగా ప్రకటించాలి

Oct 24 2026 9:44 AM | Updated on Oct 24 2026 9:44 AM

పర్లాకిమిడి: గజపతి జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు కారణంగా కరువు జిల్లాగా ప్రకటించాలని ఒడిశా కృషక్‌ సభ, సీపీఎం నాయకులు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్‌ వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు. వర్షాలు లేకపోవడంతో ఏడు సమితుల్లో కరువు తాండవిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సర్‌ ప్రక్రియను నిలిపివేయాలని, సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాడు. అనంతరం కలెక్టర్‌ అక్షయ్‌ సునీల్‌ అగర్వాల్‌ను దండపాణి రైయితో కలిసి ముఖ్యమంత్రికి రాసిన ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ఆందోళనలో సీపీఎం జిల్లా కమిటీ అధ్యక్షుడు దండపాణి రైయితో, కార్యదర్శి ఎం.బంగారి, అంబేడ్కర్‌ వీకర్‌ సెక్షన్‌ సంక్షేమ కమిటీ అధ్యక్షుడు కె.బాలకృష్ణ, మోహిత్‌ మిశాల్‌, మోజేష్‌ శోబోరో (ఉప్పలాడ) తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement