కాలువలో పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

కాలువలో పడి వ్యక్తి మృతి

Oct 24 2026 9:44 AM | Updated on Oct 24 2026 9:44 AM

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా పోడియా సమితి పామ్గేటా గ్రామ సమీపంలో ఉన్న కాలువలో శుక్రవారం ఒక వ్యక్తి పడి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన పదియా ముషాకి (65) అనే వ్యక్తి గురువారం పోడియాకు వెళ్లాడు. అనంతరం అతను రాత్రి తిరిగి ఇంటికి వచ్చే సమయంలో కాలువ దాటుతుండగా అదుపుతప్పి పడిపోయాడు. ఆ సమయంలో ఎవరూ గమనించకపోవడంతో మృత్యువాడపడ్డాడు. శుక్రవారం ఉదయం గ్రామస్తులు పదియా ముషాకిను చూసి వెంటనే కుంటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోడియా ఐఐసీ సంతోష్‌ కుమార్‌ మాఝి తన సిబ్బందితో వెళ్లి పరిస్థితిని పరిశీలించి మృతదేహన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో గర్భిణి మృతి

మల్కన్‌గిరి: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఒక నిండు గర్భిణీ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం రాత్రి 10 గంటల సమయంలో కలిమెల ప్రాంతానికి చెందిన ఒక గర్భిణీని ప్రసవం కోసం మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. అయితే వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు సిజేరియన్‌ చేయాలని సూచించినట్లు సమాచారం. కొంత సమయం తర్వాత గర్భిణీకి పురుటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ఆమె భర్త పలుమార్లు ఆస్పత్రి సిబ్బందికి తెలియజేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు సిజేరియన్‌ చేస్తామని చెప్పినా చేయకపోవడంతో మధ్యాహ్నం 12 గంటల సమయంలో పరిస్థితి విషమించింది. దీంతో వైద్యులు మరోసారి పరిశీలించి కొరాపుట్‌ తరలించాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండగా గర్భిణీ, ఆమె కడుపులో బిడ్డ ఇద్దరూ చనిపోయారు. దీంతో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఘటన చోటుచేసుకుందని, ఆస్పత్రిలో పదే పదే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు.

గజపతి ప్యాలెస్‌కు మరమ్మతులు

పర్లాకిమిడి: రాజవీధిలో ఉన్న రాజవారి ప్యాలస్‌ సింహద్వారం వద్ద ఉన్న కోట బురుజులుపై అనేక ఏళ్లుగా వున్న మర్రి చెట్లను భారీ క్రేన్‌ ద్వారా శుక్రవారం తొలగించారు. స్థానిక శ్రీజగన్నాథ మందిరం పునర్నిర్మాణంలో భాగంగా సింహద్వారం మీద అతి పెద్ద రాతిని విజయనగరం నుంచి వచ్చిన భారీ క్రేన్‌ద్వారా అమర్చారు. యువరాణి కల్యాణి గజపతి దేవ్‌ ఆదేశాల మేరకు రాజుగారి కోట పైన పెరిగిన మొక్కలను కూడా తొలగించారు. కార్యక్రమంలో సిద్ధేశ్వర మిశ్రా, శ్రీజగన్నాధ మందిర పుణర్మిణాన కమిటీ కార్యదర్శి దుర్గామాధవ పాణిగ్రాహి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement