గూడ్స్‌కు అనుమతి | - | Sakshi
Sakshi News home page

గూడ్స్‌కు అనుమతి

Oct 24 2026 9:44 AM | Updated on Oct 24 2026 9:44 AM

● భద్రతా తనిఖీల అనంతరమే ప్రయాణికుల రైళ్ల పునరుద్ధరణ ● మలిగుడ–జరాటి రైల్వే మార్గంలో పునరుద్ధరణ పనులు పూర్తి

పరిమిత వేగంతో ..
● భద్రతా తనిఖీల అనంతరమే ప్రయాణికుల రైళ్ల పునరుద్ధరణ ● మలిగుడ–జరాటి రైల్వే మార్గంలో పునరుద్ధరణ పనులు పూర్తి

రాయగడ: కొరాపుట్‌–కిరండొల్‌ రైల్వే మార్గంలోని మలిగుడ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి దెబ్బతిన్న మూడు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. సెప్టెంబరు 24 నుంచి నిలిచిపోయిన ఈ మార్గంలో బుధవారం రాత్రి పునరుద్ధరణ పనులు ముగియడంతో నిర్దేశిత భద్రతా నిబంధనలు పాటిస్తూ గూడ్స్‌ రైళ్ల రాకపోకలకు పరిమిత వేగంతో రైల్వే అధికారులు అనుమతించారు. అయితే ప్రయాణీకుల రైళ్ల రాకపోకలను పునఃప్రారంభించేందుకు ఇంకా అనుమతి లభించలేదు. ట్రాక్‌, రైల్వే మౌలిక సదుపాయాలు, ఇతర భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించి, సురక్షితమని నిర్ధారించిన తర్వాతే ప్రయాణిలకు రైళ్లను నడపనున్నట్లు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే స్పష్టం చేసింది.

యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు

మలిగుడ రైల్వే బ్రిడ్జి సమీపంలోని కిలోమీటరు 215,19 నుండ 215,23 మధ్య మలిగుడ స్టేషన్‌ యార్డు పరిధిలోని కిలోమీటర్‌ 217,25 నుంచి 217,36 మధ్య కొండచరియలు విరిగి పడిపోవడంతో రైల్వే లైన్‌ దెబ్బతింది. దీంతో కొరాపుట్‌–కిరండూల్‌ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రైల్వే ఇంజినీరింగ్‌, విద్యుత్‌, సిగ్నల్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ విభాగాల సిబ్బంది నిరంతరం శ్రమించి పునరుద్ధరణ పనులను పూర్తి చేశారు. ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఇంజినీర్‌ రాజేష్‌ శెఖావత్‌, రాయగడ డివిజనల్‌ రైల్వే మేనేజరు అమితాబ్‌ సింఘాల్‌తో పాటు పలువురు అధికారులు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో రేయింబవళ్లు ఉండి పనులను పర్యవేక్షించారు. రైల్వే ఉన్నతాధికారులు, డివిజన్‌ స్థాయి అధికారులు సమన్వయంతో వ్యవహరించి, భద్రత ప్రమాణాలకు ప్రాధాన్యమిస్తూ పనులను వేగవంతం చేశారు.

పనులను పరిశీలించిన జనరల్‌ మేనేజరు

ఈస్ట్‌ కొస్ట్‌ రైల్వే జనరల్‌ మేనేజరు పరమేశ్వర్‌ పుంక్వాల్‌ గతలో మలిగుడలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శించి, పునరుద్ధరణ పనులను పరిశీలించారు. రైల్వే మార్గాన్ని వఅలైనంత ప్రతి దశలోనూ భధ్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను అదేశించారు. ప్రధాన కార్యాలయం, డివిజన్‌ స్థాయిలో నిరంతర పర్యవేక్షణ కొనసాగింది.

ప్రయాణికులకు భద్రతే ప్రథమ ప్రాధాన్యం

రైల్వే కనెక్టివిటీ నిలిచిపోవడంతో బస్తర్‌ ప్రాంతంతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే గుర్తించింది. ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించేందుకు సాధ్యమైనంత త్వరగా రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది. అయితే భద్రత విషయంలో ఎలాంటి రాజీపడకుండా, ప్రభావిత ప్రాంతాలను పూర్తి స్థాయిలో తనిఖీ చేసి సురక్షితమని ప్రకటించిన తర్వాతే ప్రయాణికుల రైళ్లను అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement