డీజే వాహనం బోల్తా.. ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

డీజే వాహనం బోల్తా.. ఒకరు మృతి

Oct 24 2026 9:44 AM | Updated on Oct 24 2026 9:44 AM

● 15 మందికి గాయాలు

మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి అంళాజోడి గ్రామం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఓ డీజే వాహనం బోల్తా పడి ఒకరు మృతి చెందగా 15 మందికు తీవ్రగాయాలయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం మల్కన్‌గిరిలో దుర్గాపూజ అమ్మవారి నిమజ్జన వేడుకల్లో పాల్గొనేందుకు కలహండి జిల్లా ధర్మగడ్‌ గ్రామం నుంచి మల్కన్‌గిరికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వాహనం టైర్‌ పేలిపోవడంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ధోభెల్‌ష్‌ తండి (22) మృతి చెందగా మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను అంబులెన్స్‌ సాయంతో మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ నుంచి ముగ్గురికి కొరాపుట్‌ పంపించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న మత్తిలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రమాదంపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement