ఆయుధ ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

ఆయుధ ప్రదర్శన

Oct 20 2026 4:43 AM | Updated on Oct 20 2026 4:43 AM

అనాదిగా..

పర్లాకిమిడి:

తమ పూర్వీకుల నుంచి నేర్చుకున్న విద్యను ఏటా విజయదశమి నాడు ప్రదర్శించడం వారి ఆనవాయితీ. స్థానిక బెబర్తావీధి శ్రీకృష్ణచంద్రగజపతి సమరశిక్షార్థి వాహినీ, అష్టమి నుంచి నవమి వరకూ ఖోండో, బడి (కత్తి, కర్రలు) శుభ్రం చేసి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. బబర్తా వీధిలో పిల్లలు డప్పులు వాయించి కర్రసాముతో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. బెబర్తావీధిలో ఏడాదికి ఒక్కసారి మాత్రమే శ్రీకృష్ణ చంద్ర గజపతి సమర శిక్షార్థి వాహినీ తమ యుద్ధ సామగ్రిని అమ్మవారి వద్ద పూజలు జరిపి నవమి, విజయ దశమి నాడు పట్టణంలో పలు కూడళ్లలో అగ్గిదివిటీలు పట్టుకుని తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. గజపతి మహారాజుల హయంలో ఈ బెబర్తా వీధి శ్రీకృష్ణచంద్రగజపతి సమరశిక్షార్థి వాహినీ నైపుణ్యాన్ని గుర్తించి వారికి బహుమానాలు, ఇనాంలు ఇస్తుండేవారు. కాలక్రమేణా రాజుల కాలం అంతరించి పోవడంతో ఈ కళను బెబర్తా వీధిలో కొంతమంది యువకులు సంఘంగా ఏర్పడి తమ కళలను ఒడిశా ఆవిర్భావ దినోత్సవం, దసరా నాడు తమ నైపుణ్యాన్నీ ప్రదర్శిస్తుండటం విశేషం. స్వాతంత్య్ర పోరాటం, ఖండాయత్‌ యుద్ధంలో అప్పట్లో యోధులు పోరాటపటిమను చూపించినందుకు గజపతి రాజులు ఈ కళను ఆదరిస్తున్నారని కళాకారులు తెలియజేశారు. అలాగే సేరివీధిలో గజపతి భేతాళ సమర విలాస ప్రతిష్టాన్‌ యువకులు కొందరు ఏటా విజయదశమి పూజలు అనంతరం పట్టణంలో రాజావారి ప్యాలస్‌ వద్ద ప్రదర్శనలు ఇస్తుంటామని పైల మురళీకృష్ణ తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement