శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ తదితర స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ పుండకర్ అధికారులను ఆదేశించారు. సో మవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సహాయ కలెక్టర్ హరి ఓం పాండ్యాతో కలసి ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పా టు, ఎన్నికల సామగ్రి భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లపై ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. నియోజకవర్గాల వారీగా స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలను గుర్తించి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కంట్రోల్ రూమ్‌లు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని, వీడియో కవరేజ్, సీసీ కెమెరాల ఏర్పాట్లపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం టెక్కలి పలాస ఆర్డీఓలు సాయి ప్రత్యూష కృష్ణమూర్తి అప్పలరాజు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వెంకట్రామన్, జిల్లా పంచాయతీ అధికారి స్వరూప రాణి, వివిధ నోడల్ అధికారులు పాల్గొన్నారు.


