పోలీసులపై నేరస్తుడి కాల్పులు | - | Sakshi
Sakshi News home page

పోలీసులపై నేరస్తుడి కాల్పులు

Oct 20 2026 4:43 AM | Updated on Oct 20 2026 4:43 AM

రాయగడ: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కాల్పులకు తెగబడిన ఓ నేరస్తుడు ఆఖరికి పోలీసు కాల్పుల్లో గాయపడి కటకలాలపాలయ్యాడు. ఝార్సుగుడ జిల్లా రియంట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అమరమా అటవీ ప్రాంత సమీపంలో సొమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు బంటీ ప్రసాద్‌ ఎడమ కాలికి బుల్లెట్‌ గాయం కావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఖలియాకాలి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు. జిల్లా ఎస్పీ జీఆర్‌ రాఘవేంద్ర తెలియజేసిన వివరాల ప్రకారం హనుమాన్‌ నగర్‌కు చెందిన బంటీ ప్రసాద్‌ అటవీ ప్రాంతంలో దాక్కున్నట్లు సమాచారం అందడంతో ఓరియంట్‌ పోలీసు సిబ్బంది ప్రత్యేక తనిఖీ ఆపరేషన్‌ చేపట్టారు. పోలీసు బృందం సమీపించగానే బంటీ ప్రసాద్‌ కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు ఎస్‌పి తెలిపారు. దీంతో అత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరపగా, అతడి ఎడమ కాలికి బుల్లెట్‌ తగిలింది. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఘటనాస్థలంలో అక్రమ ఆయుధాలను స్వాఽధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు నేరస్తులపై కఠిన చర్యలకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. వ్యవస్థీకృత నేరాలు, అక్రమ ఆయుధాల రవాణాపై ఏమాత్రం ఉపేక్షించమని స్పష్టం చేశారు. నిందితుడి సహచరులు, ఆయుధాల సరఫరాదారులపై నిఘా పెట్టామని, నేర నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement