అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

Sep 3 2026 12:25 AM | Updated on Sep 3 2026 12:25 AM

అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

పర్లాకిమిడి: గజపతిజిల్లా గుమ్మాబ్లాక్‌ కార్యాలయంలో దశమ పంచాయతీ సమావేశానికి బరంపురం ఎంపీ ప్రదీప్‌కుమార్‌ పాణిగ్రాహి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సమావేశంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి, జిల్లా పరిషత్‌ అధ్యక్షుడు గవ ర తిరుపతిరావు, గుమ్మసమితి అధ్యక్షురాలు సునేమీ మండల్‌ తదితరులు పాల్గొన్నారు. గుమ్మబ్లాక్‌లో విద్య, వైద్య, విద్యుత్‌, గ్రామీణాభివృధ్ధి, సాగునీరు, తాగునీరు, రోడ్లు నిర్మాణంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ పాణిగ్రాహి అజయగడ–నమ్మనగుడ రోడ్డు, సెరంగో నుండి కుజాసింగి రోడ్డు నిర్మాణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణాలకు శంకుస్థాపన చేసి శిలాఫలకాలు వేశా రు. అనంతరం పర్లాకిమిడి చేరుకుని బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీడీఓ దులారాం మరాండి, జిల్లా పరిషత్‌ సీడీఓ. దయామయా పాడీ, తహసీల్దార్‌ శరత్‌ శోబోరో, జెడ్పీటీసీ (గుమ్మ)రేనుకా పాత్రో, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement