తీర్థయాత్ర రైలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

తీర్థయాత్ర రైలు ప్రారంభం

Sep 3 2026 12:25 AM | Updated on Sep 3 2026 12:25 AM

వృద్ధులకు ఉచిత ప్రయాణం

జెండా ఊపి రైలును ప్రారంభించిన డిప్యూటీ సీఎం ప్రభాతి పరిడా

భువనేశ్వర్‌: ముఖ్యమంత్రి తీర్థ యాత్ర యోజన కింద వయో వృద్ధుల తీర్థ యాత్ర ప్రత్యేక రైలు బుధవారం బయల్దేరింది. ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా జెండా ఊపి న్యూ భువనేశ్వర్‌ రైల్వే స్టేషను నుంచి దీనిని ప్రారంభించారు. ఇందులో 775 మంది వృద్ధ యాత్రికులు ప్రయాణించారు. ఈ పథకం కింద రాష్ట్రం నుంచి వారణాసి, అయోధ్యకు బుధవారం ప్రత్యేక రైలు బయల్దేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది తొలి సీనియర్‌ సిటిజన్‌ యాత్రా రైలు కావడం విశేషం. పవిత్ర లింగరాజ పుణ్య క్షేత్రం నుంచి కాశీ విశ్వనాథుడు, అయోధ్య వరకు సాగే ఈ యాత్ర వయోవృద్ధులకు ఒక చిరస్మరణీయ అనుభూతినిస్తుంది. వారి ప్రయాణం సురక్షితంగా, ఆధ్యాత్మికంగా సంతృప్తికరంగా ఉండాలని ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ యాత్రలో యాత్రికులు కాశీ విశ్వనాథుని దర్శనంతో గంగా హారతి వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని ప్రత్యక్షంగా సందర్శిస్తారు. అక్కడ నుంచి అయోధ్యలో శ్రీ రామ్‌ లల్లా దివ్య దర్శనం పొందుతారని ప్రభాతి పరిడా తెలిపారు. యాత్రా కార్యక్రమం కింద రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన వయోవృద్ధులు దేశ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన పుణ్య క్షేత్రాలను సందర్శించి గనమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఆస్వాదిస్తున్నారన్నారు.

బుధవారం బయల్దేరిన తీర్థ యాత్ర ప్రత్యేక రైలులో ఖోర్ధా, జగత్‌సింగ్‌పూర్‌, కటక్‌, పూరీ, కేం

ద్రాపడా, ఢెంకనాల్‌ 6 జిల్లాలకు చెందిన 775 వృద్ధులు పాల్గొన్నారు. జిల్లా వారీగా పాల్గొన్న యాత్రికులలో ఖోర్ధా నుంచి 169 మంది, జగత్‌సింగ్‌పూర్‌ నుంచి 85 మంది, కటక్‌ నుంచి 197 మంది, పూరీ నుంచి 127 మంది, కేంద్రాపడా నుంచి 108 మంది, ఢెంకనాల్‌ నుంచి 89 మంది ఉన్నారు. 333 మంది మహిళలు, 432 మంది పురుషులు ఉన్నారు. యాత్ర పొడవునా యాత్రికుల భద్రత, సౌకర్యం 25 మంది ఎస్కార్ట్‌ అధికారులు కూడా ఉన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక విద్యాశాఖ మంత్రి సంపద్‌ చంద్ర స్వంయి, కేంద్రాపడా ఎమ్మెల్యే గణేశ్వర్‌ బెహెరా, పర్యాటక శాఖ కమిషనర్‌ కమ్‌ కార్యదర్శి బల్వంత్‌ సింగ్‌, ఖుర్ధా కలెక్టర్‌ అమృత్‌ రుతురాజ్‌, ఖుర్దా రోడ్‌ డివిజన్‌ అదనపు డీఆర్‌ఎం ప్రదీప్‌ కుమార్‌ బెహెరా, ఐఆర్‌సీటీసీ ప్రాంతీయ మేనేజర్‌ అనుజ్‌ దత్తా, పర్యాటక శాఖ డైరెక్టర్‌ దీపాంకర్‌ మహా పాత్రో ప్రసంగించారు. ముఖ్యమంత్రి తీర్థ యాత్ర యోజన కింద 2026–27 ఆర్థిక సంవత్సరంలో 10 దశల్లో మొత్తం 8,000 మంది వయోవృద్ధులు తీర్థయాత్రలు చేపట్టనున్నారు. కార్యక్రమంలో అయోధ్య, వారణాసి, హరిద్వార్‌, రిషికేశ్‌, రామేశ్వరం, మదురై వంటి గమ్యస్థానాలు ఉంటాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement