మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సమితి ఎం.వి.92 గ్రామంలో సాగర్ సర్కార్ (23) అనే యువకుడు మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సాగర్ కొద్దిరోజుల కిందట కోల్‌కతాలో పనిచేస్తున్న సమయంలో ఓ వివాహితను ప్రేమించి తన స్వగ్రామానికి తీసుకొచ్చాడు. విషయం తెలుసుకున్న సాగర్ తండ్రి గ్రామపెద్దల సమక్షంలో ప్రజాకోర్టు నిర్వహించి సాగర్‌ను కొట్టి రూ.45 వేలు జరిమానా విధించారు. అనంతరం వివాహిత భర్తను పిలిపించి అతనితో పంపించేశారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన సాగర్ మంగళవారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. మల్కన్‌గిరి ఐఐసి ప్రభుదత్త మాలిక్ ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.


