రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి ధమునిపంగ పంచాయతీ డమలిమా గ్రామ సమీపంలో అరుదైన వన్యప్రాణి పాంగొలిన్ (బజ్రకాష్ట)ను స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పాంగొలిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆరోగ్య పరిస్థితిని బట్టి సురక్షితమైన అటవీ ప్రాంతంలో వదిలివేయనున్నట్లు ఫారెస్టర్ బర్కారాణి పాత్ర, గార్డ్ అనుష్క పండా, ఫారెస్టర్ విక్రంనాయుడు తెలిపారు.
వంశధార నదిలో వ్యక్తి గల్లంతు
రాయగడ: గుణుపూర్‌లోని వంశధార నదిలో బుధవారం స్నానానికి దిగిన ఓ వ్యక్తి నదీ ప్రవాహం కారణంగా కొట్టుకుపోయాడు. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
సముద్రంలో గల్లంతై
పర్యాటకుడి మృతి
భువనేశ్వర్: పూరీ సముద్రంలో స్నానం చేస్తున్న ఐదుగురు పర్యాటకులు అలల ధాటికి కొట్టుకుపోయారు. ఈ ఘటనలో ఓ పర్యాటకుడు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. లైట్ హౌస్ బీచ్ సమీపంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుడిని ఉత్తర ప్రదేశ్‌లోని రాణిపూర్‌కు చెందిన సుమిత్ గుప్తాగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన బీహార్‌కు చెందిన పర్యాటకుడు అనీష్ సింగ్‌ను మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్‌కు తరలించారు.సుమిత్ గుప్తా, అనీష్ సింగ్ పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సుమిత్ గుప్తా మరణించాడు. అనీష్ సింగ్ భువనేశ్వర్ ఆసుపత్రిలో ఉన్నత చికిత్స పొందుతున్నాడు.
నీటి గుంతలోకి దూసుకెళ్లిన కారు
● దంపతుల దుర్మరణం
భువనేశ్వర్: లోతైన గుంతలో కారు పడిపోవడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన పారాదీప్ గొడొ బజార్ సమీపంలో బుధవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. దంపతులు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డుపై నుంచి పక్కకు జారి పోయి నీటి గుంతలో మునగడంతో ఈ దుర్ఘటన సంభవించినట్లు భావిస్తున్నారు. మృతులను పారాదీప్ పోర్ట్‌లోని మైరెన్ డిపార్ట్‌మెంట్ విశ్రాంత ఉద్యోగి బిభూతి భూషణ్ దాస్, అతని భార్య ప్రతిమా దాస్‌గా గుర్తించారు. కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొనడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం అదుపు తప్పి నీటి గుంతలోకి దూసుకెళ్లింది. నీటిలో మునిగిపోయిన కారులో ఉన్న ఇద్దరూ అందులోనే చిక్కుకుపోయారు. వారిని సకాలంలో రక్షించలేక పోయారు. లాక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చే సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.
203 కిలోల గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సమితి ఝాటిగూడ అటవీ ప్రాంతంలో రవాణాకు సిద్ధం చేసిన 203 కిలోల గంజాయిని మల్కన్‌గిరి ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. సోమవారం అందిన ముందస్తు సమాచారం మేరకు అటవీ ప్రాంతంలో ఎకై ్సజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ పొద చాటున ఉన్న 8 గంజాయి బస్తాలు పట్టుకున్నారు. వీటిన మంగళవారం తూకం వేయగా 203 కిలోలుగా గుర్తించారు. దీని విలువ రూ.25 లక్షలు ఉంటుందని దర్యాప్తు అధికారులు తెలిపారు.


