పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీ ఆడిటోరియంలో మంగళవారం కౌశల్, కృషిమేళా నిర్వహించారు. బరంపురం ఎం.పి.ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి, సెంచూరియన్ వర్శిటీ ఉపాధ్యక్షులు డి.ఎన్.రావు, పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, ఉపకులపతి సుప్రియా పట్నాయిక్, రిజిస్ట్రార్ అనితా పాత్ర్, డైరక్టర్ (అడ్మిన్) దుర్గాప్రసాద్ పాఢి, ఎం.ఎస్.స్వామినాథన్ వ్యవసాయ కళాశాల డీన్ ఎస్.పి.నందా, ఫిషరీస్, యానిమల్ హాజ్బెండరీ డీన్ డాక్టర్ గిరీష్ మహాంతి, గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్శిటీలో డ్రోన్ సహాయంతో వ్యవసాయం, గోబర్ గ్యాస్ ప్లాంట్‌ను ప్రారంభించారు. వర్శిటీ ఉద్యానవనాలలో పండిస్తున్న వివిధ రకాల మొక్కలు, డ్రాగన్ ప్రూట్ కల్చర్, ఫిషరీస్ ఆధ్వర్యంలో రొయ్యలు, చేపల పెంపకం, వెటర్నరీ కళాశాలను ఎం.పి.ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి పరిశీలించారు. వ్యవసాయ, ఫిషరీస్, వెటర్నరీ కళాశాలలకు సెంచూరియన్ వర్శిటీ భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలు సాధిస్తుందని ఎంపీ పేర్కొన్నారు.


