రాయగడ: పట్టణాన్ని మరింత శుభ్రంగా, సుందరంగా, కాలుష్యరహితంగా తీర్చిదిద్దే దిశగా మున్సిపాలిటీ యంత్రాంగం కీలక ముందడుగు వేసింది. పట్టణంలోని ప్రధాన రహదారులను అత్యాధునిక యంత్రాలతో శుభ్రం చేసే మెకానికల స్వీపింగ్ (యాంత్రిక రోడ్ల శుభ్రత) వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఇకపై రోడ్డుపై పేరుకుపోయిన దుమ్ము, ఇసుక, చెత్తను తక్కువ సమయంలోనే సమర్ధవంతంగా తొలగించే అవకాశం ఏర్పడింది. రాష్ట్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఉత్వర్వుల మేరకు సంబల్‌పూర్ మున్సిపాల్ కొర్పొరేషన్, జయపురం మున్సిపాలిటీతో పాటు రాయగడ మున్సిపాలిటీ పరిధిలోయాంత్రిక శుభ్రత పనుల నిర్వహణకు గ్రీన్ ఇన్నొవేటీవ్ పవర్ ప్రైవెట్ లిమిటెడ్ సంస్థను నియమించారు. ఈ సంస్థతోఐదేళ్ల పాటు సేవలు అందించేలా ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక యాంత్రిక శుభ్రత వాహనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలొ రాయగడ మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ పట్నాయక్, కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


