జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో బుధవారం టీబీ ముక్త భారత్ అభిజాన్ పేరిట అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్.ఎ.సి బెటాలియన్ 15(ఓ) ఆదేశాల మేరకు కమాండింగ్ అధికారి లెఫ్టనెంట్ కర్నల్ పీతిరంజన్ దాస్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ అనూప్ నాయిక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి వైద్యుడు శివసాయి స్వరూప్ (ఎ.పి.పి.హెచ్.ఓ–టీబీ) ముఖ్యవక్తగా పాల్గొని క్షయ వ్యాధి లక్షణాలు, నిరోధక చర్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్.ఎ.సి బెటాలియన్ 15(ఓ) సుబేదార్, అసిస్టెంట్ కలెక్టర్ అనూప్ నాయిక్, కెప్టెన్ డాక్టర్ లక్ష్మణ పాత్రో తదితరులు పాల్గొన్నారు.


