విద్యుత్‌ షాక్‌తో లైన్‌మెన్‌కు గాయాలు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో లైన్‌మెన్‌కు గాయాలు

Sep 3 2026 12:25 AM | Updated on Sep 3 2026 12:25 AM

జయపురం: జయపురం సమీపంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో మరమ్మతులు చేస్తుండగా లైన్‌మెన్‌ అజిత్‌ బెహర(35) షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంటనే జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తోటి సిబ్బంది తరలించారు. అజిత్‌ బెహర స్తంభంపై మరమ్మతులు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటనపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని తోటి సిబ్బంది మండిపడ్డారు. బాధితునికి పూర్తిస్థాయిలో వైద్యం అందించాలని, తగిన నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement