నవీన్‌ పట్నాయక్‌, వీకే పాండియన్‌పై క్రిమినల్‌ రివిజన్‌ కొట్టివేసిన కోర్టు | - | Sakshi
Sakshi News home page

నవీన్‌ పట్నాయక్‌, వీకే పాండియన్‌పై క్రిమినల్‌ రివిజన్‌ కొట్టివేసిన కోర్టు

Sep 3 2026 12:25 AM | Updated on Sep 3 2026 12:25 AM

భువనేశ్వర్‌: మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, మాజీ అధికారి వి.కె.పాండియన్‌న్‌పై వ్యతిరేకంగా దాఖలైన క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌ను భువనేశ్వర్‌లోని ఖుర్దా సెషన్స్‌ కోర్టు బుధవారం కొట్టివేసింది. న్యాయవాది, సామాజిక కార్యకర్త సుధీర్‌ చరణ్‌ మహంతి దాఖలు చేసిన రివిజన్‌ ిపిటిషను కొట్టివేస్తూ ఈ ఏడాది మార్చి 25న స్థానిక ఎస్‌డీజేఎం కోర్టు ఇచ్చిన ఉత్తర్వును సమర్థించింది. నవీన్‌ పట్నాయక్‌, వి.కె.పాండియన్‌ హెలికాప్టర్‌ ప్రయాణం, ప్రజా సమావేశాలకు సంబంధించి ఖర్చుల కోసం రూ.500 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం చేశారని ప్రధాన ఆరోపణ. మూడు కీలక అంశాలను హైలైట్‌ చేస్తూ, కోర్టు ఎస్‌డీజేఎం నిర్ణయాన్ని సమర్థించింది. బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 173(4) కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో చట్టబద్ధమైన ప్రక్రియను పాటించలేదని సెషన్స్‌ కోర్టు పేర్కొంది. ఆరోపణలు నిరూపించేందుకు ప్రాథమిక సాక్ష్యాధారాలు లేనట్లు కోర్టు గమనించి ఆరోపణలు అసంబద్ధమైనవిగా పేర్కొంది. ఎస్‌డీజేఎం కోర్టు ఈ ఏడాది మార్చి 25న జారీ చేసిన ఉత్తర్వుల్లో ఎటువంటి చట్ట విరుద్ధత లేదని సెషన్స్‌ కోర్టు ధృవీకరించి క్రిమినల్‌ రివిజనన్‌ను కొట్టివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement