పింఛన్లు ఇచ్చేందుకు వెళ్తుండగా.. | - | Sakshi
Sakshi News home page

పింఛన్లు ఇచ్చేందుకు వెళ్తుండగా..

Sep 2 2026 12:24 AM | Updated on Sep 2 2026 12:24 AM

● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులకు గాయాలు

● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులకు గాయాలు

హిరమండలం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు తీవ్ర గాయాలపాలయ్యారు. పింఛన్లు పంపిణీ చేసేందుకు మంగళవారం ఉదయం వెళుతుండగా హిరమండల మండలంలోని ధనుపురం మలుపు దాబా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం మండలం బూరగాం, రొంపివలస పంచాయతీ కార్యదర్శులు వాడన ఉదయశ్రీ, గేదెల ప్రసన్నలు మంగళవారం ఉదయం స్కూటీపై వెళుతున్నారు. సరిగ్గా ధనుపురం శివార్లలో ఉన్న దాబా వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో రోడ్డుపై తుల్లిపడటంతో కార్యదర్శులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పాతపట్నం సామాజిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. హిరమండలం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

గాయపడిన బూరగాం కార్యదర్శి ఉదయశ్రీ

గాయాల పాలైన రొంపివలస కార్యదర్శి ప్రసన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement