ఘనంగా తెలుగు భాషా దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

Aug 31 2026 1:32 AM | Updated on Aug 31 2026 1:32 AM

పర్లాకిమిడి: వ్యవహారిక భాష కోసం పోరాడిన గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా స్థానిక సింహాద్రి అప్పన్న కల్యాణ మండపంలో చైతన్య ఆంధ్ర సాహితీ సంస్కృతి సమితి ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, చర్చా గోష్టి, తెలుగు భాషపై ఉపోధ్ఘాతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైతన్య ఆంధ్ర సాహితీ సంస్కృతి సమితి అధ్యక్షుడు కోండా రామారావు, కార్యదర్శి బి.జనార్దరావు ఆధ్వర్యంలో గణేష నామ స్తుతిలో మొదలుపెట్టారు. గిడుగు చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. గిడుగు తెలుగునాట పుట్టి పర్లాకిమిడి రాజావారి సంస్థానంలో ఉన్న కృష్ణచంద్ర గజపతి కళాశాలలో అధ్యాపకుడిగా పని చేశారు. ఆయన సవరభాష లిపిని కనుగోని ఇంగ్లిష్‌లో బాషలోకి తర్జుమా చేశేవారని వి.వి.రమణమూర్తి పంతులు అన్నారు. అందుకు గుర్తింపుగా మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వం గిడుగు కృషికి మెచ్చి 1913లో రావుబహదూర్‌ అని బిరుదును అందజేశారన్నారు. ఈ సందర్భంగా గిడుగు జీవనవిధానం, చరిత్రపై పలువురు మాట్లాడారు. మాతృ భాష దినోత్సవం సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు చెట్టి వేంకటేశ్వర్లు, శాసనం ధనుంజయ, వి.వి.రమణమూర్తి పంతులును ఘనంగా సత్కరించారు. ఈ సన్మాన సభలో పాతపట్నంకు చెందిన పారిశెల్లి రామరాజు, జామి పోలిశెట్టి, కోట్ని శోభారాణి, కల్యాణ వినయకుమార్‌, కోశాధికారి గణేష్‌ పట్నాయక్‌, జవ్వాది సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement