జయపురం: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ ఒకటో తేదీన నిర్వహిస్తున్న ఛలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీపీఐ నాయకులు శనివారం రాత్రి తరలివెళ్లారు. కమ్యూనిస్టు పార్టీ జిల్లా నేత ఉత్తమ మల్లాక్ నేతృత్వంలో జయపురం నుంచి హీరాకుద్ ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరారు. వారు భువనేశ్వర్ వెళ్లి అక్కడ నుంచి ఢిల్లీ వెళ్లారని రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ సభ్యులు ప్రమోద్ కుమార్ మహంతి తెలిపారు. దేశంలో ధరలు నియంత్రించటంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నిరుద్యోగ సమస్య పరిష్కరించటంలో, విద్య, వైద్య రంగాల వైఫల్యాలు పూర్తిగా విఫలమైన మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకు, అంబానీ, ఆదానీ మొదలగు పెట్టుబడుదారులకు దేశ సంపదను చౌకగా అప్పగించటానికి నిరసనగా ఢిల్లీలోని రామలీలా మైదానంలో జాతీయ కమ్యూనిస్టు పార్టీ పరివర్తన మహాసభ నిర్వహిస్తుందని నాయకులు చెప్పారు.


