జయపురం: మార్కెట్‌లో విరివిగా అమ్ముడు పోతున్న పన్నీరు, పుట్టగొడుగులు, కోవా టోకు వ్యాపార దుకాణాలపై జిల్లా ఆహార భద్రతా విభాగ అధికారులు, జయపురం మున్సిపాలిటీ అధికారులు తమతమ సిబ్బందితో సంయుక్తంగా దాడులు జరిపారు. నేడు పట్టణంలో 7 పన్నీరు దుకాణాలు ప్రాసెసింగ్ యూనిట్ల పైన మస్రూమ్ దుకాణాలపైన దాడులు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో పన్నీరు, కోవా, మష్రూమ్ శాంపిళ్లు సేకరించారు. పాలిథీన్ సంచులు వినియోగం, ట్రేడ్ లైసెన్స్‌లు లేకుండా వ్యాపారం చేయటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన మూడు దుకాణాల వ్యాపారు లపై రూ.3 వేలు చొప్పున జరీమానాలు వేశా రు. శాంపిల్స్ రిపోర్టులు వచ్చిన తర్వాత ఏమై నా కల్తీలు జరిగినట్టు వెల్లడైతే తగు చర్యలు తీసుకుంటామని జిల్లాఆహార భధ్రతా అధికారి పంకజనీ బెహరా వెల్లడించారు. ఈ దాడుల్లో మునిసిపాలిటీ కార్యనిర్వాహక అధికారి పూజ రౌత్, మునిసిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.


