జయపురంలో బయో సీఎన్‌జీ ప్లాంట్‌ | - | Sakshi
Sakshi News home page

జయపురంలో బయో సీఎన్‌జీ ప్లాంట్‌

Aug 30 2026 1:33 AM | Updated on Aug 30 2026 1:33 AM

జయపురం: జయపురంలో త్వరలో రూ.70 కోట్ల అంచనాతో బయో సీఎన్‌జీ ప్లాంట్‌ ఏర్పాటు జరగనుంది. జయపురం సమితి బలియ గ్రామ పంచాయతీ పలకాపుట్‌ గ్రామ ప్రాంతంలో చేపట్టనున్నట్లు జయపురం మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి పూజ రౌత్‌ వెల్లడించాయి. ఆ ప్లాంట్‌ లో గోబర్‌(పేడ)ఇతర వ్యర్థ పదార్థాలు వినియోగించి గ్యాస్‌ ఉత్పత్తి చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. పలకాపుట్‌, నువాపుట్‌ గ్రామాల మధ్య కుంతర్‌కాల్‌ మౌజ లో రెవెన్యూ విభాగానికి చెందిన 16.770 ఎకరాల భూమిని బయో సీఎన్‌జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. పూజా రౌత్‌, మునిసిపాలిటీ అమీన్‌ శుభశ్మిత జెన, భారత పెట్రోలియం కార్పొరేషన్‌కి చెందిన నలుగురు అధికారుల బృందం పలకాపుట్‌– నువాపుట్‌ గ్రామాల మధ్య గల కుంతరకాల్‌ మౌజలో ప్లాంట్‌కు గుర్తించిన భూమిని సందర్శించి ప్లాంట్‌కు ఉపయోగ పడుతుందా లేదా అని సమీక్షించారు. మరోసారి భూమిని సర్వే జరిపిన తరువాత తర్వాత చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement