పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రక్కు | - | Sakshi
Sakshi News home page

పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రక్కు

Aug 30 2026 1:33 AM | Updated on Aug 30 2026 1:33 AM

● ఇద్దరు మహిళలకు గాయాలు అగ్నివీర్‌ కుటుంబానికి అండగా...

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలో బలిమెల–చిత్రకొండ ప్రధాన్‌ ఘాట్‌ రోడ్డులో నూవగూడ గ్రామం వద్ద శనివారం ఉదయం ట్రక్కు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ట్రక్కు డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి డ్రైవర్‌ను చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షంచి డ్రైవర్‌ ఆరోగ్యం విషమించడంతో మల్కన్‌గిరికి రిఫర్‌ చేశారు. చిత్రకొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అధిక బరువు వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని బావించి కేసు నమోదు చేశారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి డ్రైవర్‌, యజమానా అని తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

వాహనాల తనిఖీ

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి పట్టణంలోని రవాణా కార్యాలయం ఎదుట శనివారం వాహనాల తనిఖీ చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన ఓ కంటైనార్‌ ట్రక్కును మల్కన్‌గిరి ఆర్డీ అధికారులు పట్టుకుని మొత్తం రూ.35,000 జరిమానా విధించారు. తనిఖీల్లో ట్రక్కు అధిక బరువుతో ఉన్నందున ఈ జరిమానా వేశారు. ఓవర్‌ లోడ్‌తో వాహనాలు నడిపితే జరిమానా తప్పదని హెచ్చరించారు.

ట్రక్కును ఢీకొట్టిన కారు

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని ఆదర్శ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో నిలిపి ఉంచిన ట్రక్కును కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటన శనివారం జరిగింది. కారులో ఉన్న ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. కారు కలిమెల సమితి కంగురుకొండ ప్రాంతానికి చెందినదిగా గుర్తించారు. కారు ముందు భాగం పాడైంది. డ్రైవర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదంపై మల్కన్‌గిరి పోలీసులు కేసు నమోదు చేశారు.

శబరపల్లిలో సౌరా భాష పుస్తకావిష్కరణ

రాయగడ: ఆదివాసీ సౌరభాష, సాహిత్యం, సంస్కృతిని పరిరక్షించి, భావితరాలకు అందించేందుకు జిల్లాలోని రామనగుడ సమితి పరిధి పరిఖితి పంచాయతీలోని శబరపల్లి గ్రామంలొ సౌరా పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. సౌరా ఎడ్యుకేషన్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో పాటు 125 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఒడిశా స్కూ ల్‌ ఎడ్యుకేషనల్‌ ప్రొగ్రామ్‌ అథారిటీ బహుభాషా విద్యా కార్యక్రమం రిసొర్స్‌ పర్శన్‌, ప్రముఖ రచయిత ఇనాం గమాంగ్‌ రచించిన ఈ పుస్తకం సౌర భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణకు కీలకమైన ప్రయత్నంగా కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. ముఖ్యఅతిథిగా శ్యామఘన్‌ భుయాన్‌ హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. యూత్‌ అసోసియేషన్‌కు చెందిన విశ్వనాథ్‌సబర్‌, ఉపాధ్యక్షుడు గిరికిమి సబర్‌, సత్యసావిత్ర సబర్‌, జగ్గారావు బిడిక పాల్గొన్నారు.

జి.సిగడాం(పొందూరు): మండలంలోని మజ్జిలపేట గ్రామానికి చెందిన మొజ్జాడ అసిరినాయుడు, వరలక్ష్మి దంపతుల కుమారులు మొజ్జాడ విష్ణుమూర్తి, రామకృష్ణ ప్రమాదవశాత్తు నేలబావిలో పడి మృత్యువాతపడిన విషయం తెలిసిందే. వీరిలో విష్ణుమూర్తి అగ్నివీర్‌లో శిక్షణ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. వీరిని దృష్టిలో ఉంచుకుని జిల్లా మాజీ సైనికుల సంఘం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ రూ.82 వేల ఆర్థిక సాయం ఆ కుటుంబానికి శనివారం అందజేసింది. కార్యక్రమంలో చైర్మన్‌ కల్నల్‌ ఎం.టి.రాజు, అధ్యక్షుడు సువ్వారి నీలాచలం, జనరల్‌ సెక్రటరీ అమ్మాజీరావు, కిల్లి వెంకటరమణ, కింతలి రామారావు, అన్నెపు నర్సింహులు, పైడి రంగనాథం, కీర్తి సుశీల, బొడ్డేపల్లి మోహన్‌, పి.జగన్‌మోహన్‌, బి.గోవిందరావు, మల్లేశ్వరరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement