జయపురం: సంస్కృతం అన్ని భాషలకు మూలమని, ఆ భాష మహాసముద్రం వంటిదని పలువురు వక్తలు అన్నారు. శనివారం జయపురం పూజ్య పూజ సంసద్ నిర్వహించిన సంస్కృత భాషా దినోత్సవం, స్వభావకవి గంగాధర మెహర్ జయంతి కార్యక్రమానికి పూజ్య పూజ సంసద్ అధ్యక్షుడు ఉదయ శంకర జానీ అధ్యక్షత వహించారు. ఆది యుగం నుంచి ఆధునిక యుగం వరకు సాహిత్య రుచిని సమాజానికి అందేలా సంస్కృతం చేసిందని అన్నారు. అందుకే భాషా సాహిత్యాలకు జనకుడు సంస్కృతం అని వాఖ్యానించారు. హిందీ భాషను విస్తృత ప్రచారం చేసి భాషా పరిరక్షణకు హిందీ భాషాప్రియులు, అభిమానులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 19వ శతాబ్దానికి చెందిన ఒడియా కవి గంగాధర మెహరను స్వభావ కవిగా రాష్ట్రంలో ప్రసిద్ధి చెందారన్నారు. ఆయన సాహిత్య మేధావి, ఆయన రచనలు భాషా ప్రగతికి ఎంతో తోడ్పడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో పూజ్య పూజ సంసద్ కార్యదర్శి బైరాగి చరణ సాహు, ఎకంబా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బి.నళినీ కుమార్, శోభాగిణి నందా, సంధ్యారాణి సాహు, ప్రీతి కాంచన సాహు, సంఘమిత్రా భుక్త, బిపిన్ కుమార్ మిత్ర, సరస్వతీ సాహు, తపన్ కుమార్ త్రిపాఠీ, సెజల్ కుమార్ సాహు, మహేశ్వర నాయక్, సంజయ కుమార్‌సాహు, ఆచార్య కౌశిక్, అనీశా కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. సాహితీవేత్తలు, ఇంజినీర్ కేధార్ నాథ్ బెహర, ఇంజినీర్ భాస్కర్ సామంతరాయ్, అనసూయ సామంతరాయ్ ఘనంగా సన్మానించారు. ఇటువంటి కార్యక్రమాలను ప్రతి పాఠశాలలో నిర్వహిస్తూ విద్యార్థులలో హిందీ భాష పట్ల ఆసక్తిని పెంచాలని సన్మాన గ్రహితులు విజ్ఞప్తి చేశారు.


