కత్తులతో బెదిరించారు.. 30 పందులను ఎత్తుకెళ్లారు | - | Sakshi
Sakshi News home page

కత్తులతో బెదిరించారు.. 30 పందులను ఎత్తుకెళ్లారు

Aug 28 2026 1:27 AM | Updated on Aug 28 2026 1:27 AM

రాయగడ: పందుల ఫారంలోకి అర్ధరాత్రి చొరబడిన గుర్తు తెలియని దుండగులు కత్తులతో బెదిరించి ఫారం నిర్వాహకుడిపై దాడిచేసి అతడిని కట్టివేసి పందులను పికప్‌ వ్యాన్‌ లో ఎత్తుకెళ్లిన ఘటనను జార్సుగుడ జరగగా.. జిల్లా బ్రజరాజ్‌ నగర్‌ పోలీసులు కేసును ఛేదించారు. కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి 10 పందులు, నేరానికి వినియోగించిన ఆయుధాలు, బాధితుడి మొబైల్‌ ఫోన్‌, పికప్‌ వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఝార్సుగుడ ఎస్పీ జీఆర్‌ రాఘవేంద్ర మీడియాకు విడుదల చేసిన వివరాల ప్రకారం పూర్వాపురాలు ఇలా ఉన్నాయి.

జిల్లాలోని బరకాండియా ప్రాంతానికి చెందిన ఆయోధ్యా రొహిదాస్‌ అనే వ్యక్తి గత 5 నెలలుగా పందుల ఫారం నిర్వహిస్తు జీవనోపాధి పొందుతున్నాడు. ఈ నెల 24,25 తేదీల మధ్య అర్ధరాత్రి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు పందుల ఫారంలోకి చొరబడి మరణాయుధాలతో రొహిదాస్‌ అనే వ్యక్తిని బెదిరించి దాడి చేశారు. అనంతరం అతడు ధరించే దుస్తులను విప్పి అతడిని కట్టివేసి ఫారంలో ఉన్న 30 పందులను బలవంతంగా పికప్‌ వ్యాన్‌లో ఎక్కించుకుని పరారయ్యారు. ఈ ఘనలో బాధితుడి బొటల వేనికి గాయమైంది. విషయం ఎవరికై నా చెబితే ప్రాణాలు తీస్తామని దుండగులు బెదించారు. అంతే కాకుండా బాధితుడి మొబైల్‌ ఫోన్‌ను లాక్కుని, సిమ్‌ కార్డును తొలగించి దూరంగా పారవేశారు. ఈ విషయమై బాధితుడు బ్రజరాజ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్పీ రాఘవేంద్ర ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టారు. అనంతరం కేసుకు సంబంధించి సాహిల్‌ ఓరం, సునీల్‌ అలియాస్‌ కాళీ కలేట్‌ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 10 పందులు, మరణాయుధాలు, పికప్‌ వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement