జయపురం:
జయపురం ఆహార భద్రతా విభాగం, మున్సిపాలిటీ హెల్త్ సిబ్బంది సంయుక్తంగా మిఠాయి దుకాణాలు, హొటళ్లు, బేకరీ దుకాణాలపై గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. పట్టణ ప్రధాన మార్గంలో ఉన్న ఓం ప్రకాశ్ స్వీట్స్ దుకాణం, ఓం ప్రకాస్వీట్స్ తయారు చేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను తనిఖీ చేసి మిఠాయి తయారుకు వినియోగిస్తున్న సరుకులను పరిశీలించారు. అక్కడ పరిశుభ్రత, మిఠాయిల నాణ్యతలను పరిశీలించారు. అనంతరం వారు పట్టణంలో గల పలు మిఠాయి దుకాణాలను, బేకరీ దుకాణాలను, హొటళ్లను తనిఖీ చేసి ఆహార పదార్థాలు పరిశీలించారు. కొన్ని హొటళ్లలో అపరిశుభ్రత గుర్తించి నోటీసులు జారీ చేశారు. పదార్థాల తయారీకి వినియోగిస్తున్న వస్తువులను పరీక్షలకు పంపించారు. ఆ రిపోర్టు వచ్చిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని ఆహార సురక్షా అధికారి పంకజనీ బెహరా వెల్లడించారు. రూ.15వేల వరకు జరిమానాలు వసూలు చేశామని తెలిపారు. దాడుల్లో మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారిణి పూజ రౌత్ ఆదేశం మేరకు హెల్త్ సిబ్బంది భవానీ హల్వ, సత్యనారాయణ పాత్రో, జగదీష్ రావు తదితరులు పాల్గొన్నారు.


